Rain in Several Places in Hyderabad: మేఘావృతమైన ఆకాశం.. పలు ప్రాంతాల్లో జల్లులు
Rain in Several Places in Hyderabad: నగరంలో చిరుజల్లులు మళ్ళీ షురూ అయ్యాయి. వరుణుడు మళ్లీ భాగ్యనగరంలో వర్షించేందుకు సిద్దమయ్యాడు. ఇవాళ దుయం నుంచి ఆకాశం మేఘావృతం కావడంతో.. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మాసబ్‌ట్యాంక్, లక్డీకపూల్, నాంపల్లి, ఖైరతాబాద్, అమీర్‌పేట్, పంజాగుట్టలో వాన కురుస్తోంది.
ఈనేపథ్యంలో.. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర వాయవ్య దిశగా కదిలి రాగల 36 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో.. ఈ వాయుగుండం ప్రభావం తెలంగాణపై తక్కువగా ఉంటుందని పేర్కొంది. ఇవాళ ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా.. ఈ నెల 17వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
భద్రాచలం జిల్లా పర్ణశాల వద్ద వరద ఉధృతి కొనసాగుతుంది. నీటిలోనే ఇంకా నార చీరల ప్రాంతం. గత నెల జులైలో వచ్చిన వరద ప్రవాహానికి కొట్టుకొని పోయిన షాపులు. నెల రోజుల నుండి ఇప్పటి వరకు షాపులు మూతపడి ఉండటంతో.. లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని ఇంకా కోలుకులేని పరిస్థితుల్లో వుంటే మరోసారి వరద ముంపు ఉంది అనడంతో ఇక్కడి ప్రజలు భయాందోళ చెందుతున్నారు. ఇక్కడ ఉన్న మెట్ల ద్వారా వరద ఉధృతిని అంచనా వేసుకుంటున్నామని షాపు యజమానులు చెప్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
Raghunandan Rao: ఏ చట్ట ప్రకారం మంత్రి గాల్లో కాల్పులు జరిపారు.. సస్పెండ్ చేయండి
- Tags
- Banjara Hills
- hyderabad
- rain
తాజావార్తలు
-
Couple: 29 ఏళ్ల మహిళ.. 36 ఏళ్ల ప్రియుడిని హోటల్‌కు పిలిచి.. గదిలో ఇలా..
-
Pawan Kalyan: అధికారులతో చర్చిస్తుండగా తీవ్ర అస్వస్థత.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఆపరేషన్..
-
AP Weather Alert: ఏపీలో డబుల్ అలర్ట్.. రేపు, ఎల్లుండి పిడుగులతో కూడిన వర్షాలు.. ఆ జిల్లాల్లో ఎండలు..
-
RCB vs DC: “చిన్నస్వామిలో ‘కిల్లర్’ షో.. ఆర్సీబీ చేతిలో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్న మిల్లర్.. బెంగళూరుకు షాక్!”
-
CSK Vs SRH: టాస్ గెలిచిన సీఎస్కే.. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్.. ఇరు జట్లలోకి కొత్త ప్లేయర్లు..
ట్రెండింగ్
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?
-
Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!