NTV Telugu Site icon

MLC Kavitha: మహిళా రిజర్వేషన్ పోరాటానికి సన్నద్ధం కావాలి.. కవిత పిలుపు

Kavitha On Reservation

Kavitha On Reservation

MLC Kavitha Speech In Malla Reddy College On Women Day: మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కల్పనకు కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలన్న పోరాటానికి సన్నద్ధం కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. మంగళవారం మల్లారెడ్డి విద్యాసంస్థల్లో నిర్వహించిన మహిళా దినోత్సవం కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సాటి మహిళలకు ఏదైనా చేయడాన్ని బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. తనకన్నా ముందు తరం మహిళలు స్వాతంత్రం కోసం పోరాడారని, తన తరంలోని మహిళలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని, ఇప్పుడు మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కోసం పోరాటం చేసేందుకు సన్నద్ధం అవ్వాలని చెప్పారు. ఈ మహిళా రిజర్వేషన్ పోరాటాన్ని తాను ముందుకు తీసుకెళ్లానని, భవిష్యత్తు మహిళా తరానికి మీరేం చేస్తారో ఆలోచించుకోవాలని అన్నారు.

Police Torture: దారుణం.. పోలీసుల వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్య

లింగ సమానత్వంతో పాటు మహిళలకు, పురుషులకు సమానమైన వేతనాలు, పని గంటలు ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ మహిళా దినోత్సవం వచ్చిందని కవిత వివరించారు. కానీ.. మన దేశంలో అసమానతలు ఇంకా అలాగే ఉన్నాయని, సమానత్వం ఇంకా రాలేదని చెప్పారు. సమానమైన వేతనాల కోసం ఆడపిల్లలు డిమాండ్ చేయాలన్నారు. మహిళా విద్యార్థులందరూ ఆయా కంపెనీలు ఇచ్చే జీతాలను అధ్యయనం చేయాలని, పురుషులకు ఇచ్చే జీతాలతో సమానంగా తమకు ఇవ్వాలని డిమాండ్ చేయాలని సూచించారు. ఇక్కడి నుంచే మార్పు మొదలు కావాలన్నారు. చదువుకోవడం, ఉద్యోగం చేయడం అనే పద్ధతి ఇప్పుడు పాతగా అయిపోయిందని.. ఉద్యోగం చేసి, అనుభవం గడించి మనమే ఒక పరిశ్రమ స్థాపించి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించాలన్న పద్ధతి రావాలని అభిప్రాయపడ్డారు. బహుళజాతి సంస్థల్లో ఉద్యోగం చేద్దామన్న ఆలోచన కాకుండా.. మనమే ఒక బహుళ జాతి సంస్థను ఎందుకు పెట్టకూడదన్న ఆలోచన చేయాలని దిశానిర్దేశం చేశారు.

Tragedy In Holi Festival: హోలీ సంబరాల్లో విషాదం.. ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి..

ఈరోజు ఉన్న సాంకేతికత, అవకాశాల నేపథ్యంలో.. పట్టుదల ఉంటే చాలని, డబ్బులు వాటంతట అవే వస్తాయని కవిత పేర్కొన్నారు. ఐడియాలుంటే.. సహాయం చేసేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాయన్నారు. ఒక ఐడియాతో వస్తే.. మార్గ నిర్దేశం చేయడానికి, వనరులు సమకూర్చడానికి టీ-వర్క్స్, టీ-హబ్ వంటివి అన్ని రకాల మద్దతు అందిస్తాయన్నారు. ఆడపిల్లలు స్మార్ట్‌గా ఉండడమే కాదు, స్మార్ట్ ఫోన్‌లా ఉండాలన్నారు. జీవితంలోకి ఎవరు కావాలో వాళ్ళని మాత్రమే రానివ్వాలని, నెగెటివ్ వ్యక్తులను రానివ్వకూడదని తెలిపారు. మన మనసు ఏది చెప్తే అదే చేయాలని అన్నారు. ఎవరైనా కామెంట్ చేస్తే, నవ్వి వాళ్లను విస్మరించాలని.. సోషల్ మీడియాలో ఎవరైనా వేధిస్తే, వారి ఖాతాలను తొలగించే విధానం రావాలని ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షించారు.

Kishan Reddy: కేసీఆర్‌కు జవాబిచ్చే సంస్కారం లేదు.. కిషన్ రెడ్డి ఫైర్