రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు జన్మదినాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. జన్మదిన శుభాకాంక్షలు బావ.. ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటున్నట్టు కవిత తన ట్వీట్లో పేర్కొన్నారు.
Wishing @trsharish Bava a happy birthday. May you be blessed with good health and a long life pic.twitter.com/MF7d3nH7Tc
— Kavitha Kalvakuntla (@RaoKavitha) June 3, 2022
కాగా.. తిరుమల శ్రీవారిని రాష్ట్ర మంత్రి హరీశ్ రావ్ దర్శించుకున్నారు. ఈరోజు హరీశ్ రావ్ పుట్టిన రోజు సందర్భంగా స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న రాత్రి కాలినడకన తిరుమల చేరుకున్న హరీశ్ రావును తిరుమల దేవస్థాన అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారి తీర్ధప్రసాదాలను, పట్టువస్త్రాలను అందజేశారు. అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. నేటితో తను 50వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా స్వామి వారి ఆశీస్సులు పొందడానికి తిరుమల వచ్చినట్లు తెలిపారు.
అయితే.. నిన్న మంత్రి హరీశ్‌రావు శుక్రవారం జరుపుకోబోయే తన జన్మదినం సందర్భంగా.. అభిమానులకు ఒక సందేశం ఇచ్చారు. తన పుట్టిన రోజు న శుభాకాంక్షలు చెప్పడానికి, నన్ను ఆశీర్వదించడానికి వస్తామంటూ ఫోన్లు చేస్తూ, సందేశాలు పంపుతున్న ప్రతీ ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఙతలు అన్నారు. మీ అందరిని నిరాశపరుస్తున్నందుకు మన్నించాలని. జూన్ 3న హైదరాబాద్‌లో కానీ, సిద్దిపేటలో కానీ ఉండడం లేదని ప్రకటించారు. ముందే నిర్ణయించుకున్న వ్యక్తిగత కార్యక్రమాల్లో భాగంగా నేను దూరంగా ఉండవలసి వస్తోందని అన్నారు. నా పట్ల మీకున్న ప్రేమను సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల ద్వారా చాటాలని కోరుకుంతున్నానని హరీశ్‌రావు సందేశం ఇచ్చారు.