MLC Kavitha: నిఖత్ మరిన్ని విజయాలు సాధించాలి.. అభినందించిన కవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha: బాక్సింగ్ ఛాంపియన్, అర్జున అవార్డు గ్రహీత నిఖత్ జరీన్ ఈ రోజు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిశారు. ఈ సందర్భంగా ఆమె ఇటీవల అందుకున్న అర్జున అవార్డును, జాతీయ మహిళా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ గోల్డ్ మెడల్‌ను ఎమ్మెల్సీ కవితకు చూపించారు. దీంతో నిఖత్ జరీన్‌ను కవిత అభినందించారు. దేశ ప్రతిష్టను పెంచేందుకు నిఖత్ క్రీడా రంగంలో ప్రతిభ కనబరుస్తున్నారని కొనియాడారు. నిఖత్ భవిష్యత్తులో దేశం కోసం ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని కవిత ఆకాంక్షించారు. బాక్సింగ్ ఛాంపియన్, భారత గోల్డెన్ గర్ల్ నిఖత్‌ను నేను అభినందిస్తున్నానని, దేశం తరపున బాక్సింగ్‌లో ఆమె సాధించిన విజయాలకు మనమందరం గర్వపడాలని కవిత ట్వీట్ చేశారు.
Met and honoured the Golden Girl of Telangana and India, Boxing Champion @nikhat_zareen
Also Read
We are so proud of her accomplishments and achievements. Wishing her all the very best for her future endeavours. pic.twitter.com/KMaYhLWtur
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 29, 2022
మధ్యప్రదేశ్‌లోని భోపాల్ వేదికగా జరిగిన జాతీయ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో అదిరిపోయే పెర్ఫార్మెన్స్ కనబరిచి, టైటిల్ సొంతం చేసుకుంది తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్. ఫైనల్ మ్యాచ్‌లో రైల్వేస్‌కు చెందిన తన ప్రత్యర్థి అనామికపై 4-1 తేడాతో ఘనవిజయం సాధించింది. అంతకుముందు సెమీ ఫైనల్స్‌లోనూ శివిందర్ కౌర్‌ను 5-0 తేడాతో చిత్తుగా ఓడించిన నిఖత్.. ఫైనల్స్‌లో ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా రప్ఫాడించేసింది. దీంతో.. అనామిక ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ఆమె ఒక బౌట్‌ను గెలిచినా, చివరికి నిఖత్ చేతిలో ఓటమి తప్పలేదు.
మొత్తం ఐదు రౌండ్లు జరగ్గా.. కేవలం చివరి రౌండ్‌లో మాత్రమే నిఖత్ కంటే అనామిక ఎక్కువ పాయింట్లు దక్కించుకోగలిగింది. మిగిలిన రౌండ్లలో నిఖద్‌దే పైచేయి. ఫలితంగా.. 4-1 తేడాతో నిఖత్ విజయం సాధించి, జాతీయ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం కైవసం చేసుకుంది. ఈ ఏడాది ఆరంభంలో స్ట్రాంజా మెమోరియల్ టోర్నమెంట్‌లో పసిడి గెలిచిన నిఖత్.. ఆ తర్వాత ప్రపంచ చాంపియన్ షిప్ గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే! కామన్వెల్త్ గేమ్స్ 2022లోనూ సత్తా చాటుకొని, టైటిల్ నెగ్గింది. ఇప్పుడు జాతీయ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలిచినందుకు.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆమెను అభినందించారు. అభిమానులు సైతం ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ప్రతీ టోర్నీలోనూ సత్తా చాటుతూ.. రాష్ట్ర ప్రతిష్టను దిశదిశలా చాటుతోందని కొనియాడుతున్నారు.
Fight on flight: ఎయిర్‌బస్‌ను ఎర్ర బస్సు చేశారు కదరా.. ఫ్లైట్‌లో చితక్కొట్టుకున్న ప్రయాణికులు
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!