MLC Kavitha: నేటితో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియనుంది. ఢిల్లీ లిక్కర్ ష్కామ్ కేసులో ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను అధికారులు ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు వాదనలు జరగనున్నాయి. ఈ క్రమంలో ట్రయల్ కోర్టు ఈడీ వాదనలు విననుంది. సీబీఐ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై మే 2న ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ భవేజా ధర్మాసనం తీర్పును ప్రకటించనుంది. ఈడీ ఆమెను రెండు విడతలుగా మొత్తం పది రోజుల పాటు ప్రశ్నించింది. కవితను మరికొద్ది రోజులు కస్టడీలో ఉంచాలని కోరనున్నట్లు సమాచారం.
Read also: Padma Bhushan Award: పద్మభూషణ్ అందుకున్న మిథున్ చక్రవర్తి, ఉషా ఉతుప్
అయితే కవిత కస్టడీని కోర్టు పొడిగిస్తారా? లేక తిరస్కరిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. మార్చి 15న కవితను హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మద్యం కేసులో ఇప్పటికే పలువురు నిందితులను అరెస్టు చేసి వాంగ్మూలాలు ఇచ్చారు. నిందితుల వాంగ్మూలాలపై ఈడీ అధికారులు కవిత నుంచి వివరణ తీసుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కస్టడీని మరో రెండు రోజులు పొడిగించాలని ఈడీ కోర్టును కోరే అవకాశం ఉంది. ఇప్పటికే కవిత ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు వాదనలను రౌస్ అవెన్యూ కోర్టు నేడు విచారించే అవకాశం ఉంది. కవిత మరోసారి ఈడీ కస్టడీకి ఇస్తారా? లేక కోర్టు జ్యుడీషియల్ కస్టడీ ఇస్తుందా? లేకుంటే బెయిల్ ఇస్తారా? అనే విషయాలపై స్పష్టత రానుంది.
BRS KTR: నేడు వరంగల్ కు కేటీఆర్..!