Naveen Ul Haq: కోహ్లీకి నవీన్ ‘సారీ’ చెప్పాడా.. ఇదిగోండి ప్రూఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Did Naveen Ul Haq Really Apologised Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ నవీన్ ఉల్ హక్ మధ్య కొనసాగుతున్న వివాదం గురించి అందరికీ తెలిసిందే! ఐపీఎల్‌లోని ఓ మ్యాచ్ సందర్భంగా జరిగిన వీరి మధ్య గొడవ.. చినికి చినికి గాలివానగా మారుతోందే తప్ప సద్దుమణగడం లేదు. సోషల్ మీడియా మాధ్యమంగా ఇద్దరు పరోక్షంగా కౌంటర్లు వేసుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా.. నవీన్ హద్దుమీరి రెచ్చిపోయాడు. ఓ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోయినప్పుడు.. మామిడిపళ్లు బాగున్నాయంటూ స్టేటస్‌లు పెట్టి, ఆర్సీబీని కించపరచాలని చూశాడు. ఇక అప్పటి నుంచి కోహ్లీ ఫ్యాన్స్ అతనిపై ఏకధాటిగా దాడి చేస్తూనే ఉన్నారు. ఏదైనా మ్యాచ్‌లో అతడు బౌలింగ్ వేస్తే చాలు.. ‘కోహ్లీ కోహ్లీ’ అంటూ నినాదాలతో అతనికి చుక్కలు చూపిస్తున్నారు. ఎలిమినేటర్ మ్యాచ్ సమయంలోనూ అదే రిపీట్ అయ్యింది. ఇక ఎలిమినేటర్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ ఓడిపోయాక.. మామిడిపళ్ల ఫోటోలను షేర్ చేస్తూ, ఎల్‌ఎస్‌జీ జట్టుని ముఖ్యంగా నవీన్‌కి బుద్ధి వచ్చేలా పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు.

Also Read
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Tipu Sultan’s Sword: రూ. 140 కోట్లకు అమ్ముడైన టిప్పు సుల్తాన్ కత్తి..
ఇలాంటి తరుణంలో.. నవీన్ ఉల్ హక్ పేరిట ఉన్న ఒక ట్విటర్ హ్యాండిల్‌లో విరాట్ కోహ్లీకి క్షమాపణలు చెప్పిన ఒక ట్వీట్ వెలుగుచూసింది. తాను చేసింది ముమ్మాటికీ తప్పేనని, విరాట్ కోహ్లీ పట్ల అలా ప్రవర్తించకుండా ఉండాల్సిందని, ఇందుకు తాను క్షమాపణలు చెప్తున్నానంటూ మరో ట్వీట్ కనిపించింది. తదుపరి సీజన్‌లో తాను ఏ సీనియర్ ప్లేయర్‌తోనూ గొడవ పెట్టుకోనని, తన హద్దుల్లోనే తాను ఉంటానని, కోహ్లీ ఫ్యాన్స్‌కి సారీ అంటూ ఆ ట్వీట్‌లో పేర్కొనబడి ఉంది. తొలుత ఇది చూసి.. అందరూ నిజమేనని అనుకున్నారు. ఆ ట్విటర్ హ్యాండిల్‌కి బ్లూ టిక్ లేకపోయినా.. బహుశా అది నవీన్‌దే అయ్యుండొచ్చని అందరూ భ్రమ పడ్డారు. కానీ, ఆ తర్వాత మరో ట్వీట్ చూశాక, అది ఫేక్ అకౌంట్ అని దాదాపు ఖరారు అయిపోయింది. బాబర్ ఆజంను విరాట్ కోహ్లీతో పోల్చవద్దని, కోహ్లీకి అతడు ఒక శాతం కూడా సరితూగడని, అసలై కింగ్ కోహ్లీనే అంటూ ఆ ట్వీట్‌లో రాసి ఉంది. దీంతో.. అనుమానం వచ్చి ఆ ట్విటర్ హ్యాండిల్ ఎవరిదా? అని ఆరా తీస్తే.. అది విరాట్ కోహ్లీ అభిమానిదని తేలింది. నవీన్ ఉల్ హక్‌కి ఆ ట్విటర్ ఖాతాతో సంబంధమే లేదని తేలింది. అంటే.. ఈ లెక్కన అతడు సారీ చెప్పలేదని తేలిపోయిందన్నమాట!
Dimple Hayathi: డింపుల్ ప్రాణాలకు హాని ఉంది.. డీసీపీ బెదిరిస్తున్నాడు..?
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!