రాష్ట్రం పై రాక్షసులు పడ్డట్టు బీజేపీ నేతలు దాడి చేస్తున్నారని ఎమ్మెల్యే వివేకానంద మండిపడ్డారు. మోదీ కంటే ముందే సీఎం కేసీఆర్ రాజకీయాల్లో వచ్చారని చెప్పారు. సీఎం కేసీఆర్ తెలంగాణ సాధించి అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెట్టిన నాయకుడని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకొస్తున్న నాయకుడు మంత్రి కేటీఆర్ అని వెల్లడించారు. అంతేకాకుండా.. ఆర్థిక క్రమశిక్షణను తెలంగాణ అద్భుతంగా పాటిస్తున్నదని చెప్పారు. కాగా.. కేంద్రం ఇస్తున్న అవార్డులే తెలంగాణ ప్రగతికి నిదర్శనమని వివేకానంద చెప్పారు.
read also: World Record: పదేళ్లకే ప్రపంచ రికార్డు. విశాఖ బాలిక విజయ పతాక
అయితే.. వాస్తవాలు తెసుకోకుండా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్‌లో పరిశ్రమలకు పవర్ హాలిడేలు ప్రకటించారని విమర్శించారు. రాష్ట్రంలో.. మాత్రం అన్ని రంగాలకు 24 గంటలు కరెంటు ఇస్తున్నామని చెప్పారు. ప్రధాని మోదీ ఎంపీగా ఉన్న వారణాసిలో బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిందన్నారు. అంతేకాకుండా.. నాగార్జున సాగర్, హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్లు రాలేదన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
