MLA Raja Singh Claims That MIM Party Behind Fake Certificates: జీహెచ్ఎంసీలో వెలుగు చూసిన నకిలీ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నకిలీ సర్టిఫికెట్ల జారీ వెనుక ఎంఐఎం పార్టీ కుట్ర దాగి ఉందని ఆరోపణలు చేసిన ఆయన.. దీనిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఓల్డ్ సిటీలోనే ఎక్కువగా బర్త్ సర్టిఫికేట్లు ఉన్నాయని.. ఇందులో టెర్రరిస్టులు కూడా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఎంఐఎం పార్టీకి ముందు నుంచే నకిలీ సర్టిఫికెట్లు తయారు చేయడం అలవాటు ఉందని వ్యాఖ్యానించారు. బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు, టెర్రరిస్టులు, స్లీపర్ సెల్స్ కోసమే ఈ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నారని ఆరోపించారు. తాము తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్లమేనని, తామూ బారతీయులమేనని నిరూపించుకోవడం కోసం.. నకిలీ సర్టిఫికెట్లను సృష్టిస్తున్నారని అన్నారు.
Hardik Pandya: హార్దిక్ పాండ్యా సరికొత్త సంచలనం.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్
తాను విడుదల చేసిన వీడియోలో రాజాసింగ్ మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్‌లో 27 వేల బర్త్ సర్టిఫికెట్లు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి? మున్సిపల్ అధికారుల సంతకం గానీ, స్టాంప్ గానీ లేకుండా ఒక్క బర్త్ సర్టిఫికెట్ కూడా తయారవ్వదు. అలాంటిది.. 27 వేల నకిలీ బర్త్ సర్టిఫికేట్లు ఓల్డ్ సిటీలో వెలుగు చూశాయంటే, కచ్ఛితంగా దీని వెనుక ఏదో కుట్ర దాగి ఉంది. ఈ నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం వెనుక ఎంఐఎం పార్టీ వాళ్లు ఉన్నారు. వాళ్లు అక్రమంగా ఈ బర్త్ సర్టిఫికెట్లు తయారు చేయించారు. ఇందులో ఎంతోమంది పాకిస్తానీయులు, బంగ్లాదేశీయులు ఉన్నారు. ఇంకా ఎంతమంది ఈ హైదరాబాద్ నగరాన్ని టెర్రిరిస్ట్ అడ్డాగా మార్చుకున్నారో తేలాలి. ఈ కుట్రపై సీబీఐ ఎంక్వైరీ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. కేవలం ఈ 27 వేల నకిలీ సర్టిఫికేట్లే కాదు.. ఇంకా ఎన్నో అక్రమ రేషన్ కార్డులు, ఓటర్ కార్డులు ఉన్నాయి. వీటన్నింటిపై సీబీఐ విచారణ చేయాలని నేను కోరుతున్నాను’’ అంటూ పేర్కొన్నారు.
Sri chaitanya college: సాత్విక్ ఆత్మహత్య.. శ్రీచైతన్య కళాశాలకు శాశ్వత గుర్తింపు రద్దు
ఇదిలావుండగా.. సరైన పత్రాలు లేకుండానే 31 వేల బర్త్ & డెత్ సర్టిఫికేట్లను జీహెచ్ఎంసీ అధికారులు జారీ చేసినట్లు వెలుగులోకి వచ్చింది. కంప్యూటర్ ఆపరేటర్లు, ఎంఓహెచ్, ఏఎంసీఏ, ప్రధాన కార్యాలయంలోని ముఖ్య అధికారులు.. ఈ నకిలీ సర్టిఫికెట్లను జారీ చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. 2020 మార్చి నుంచి డిసెంబర్ 2022 వరకు.. నాన్ అవెలెబిలిటీ కింద 27,328 బర్త్ సర్టిఫికెట్లు, మరో 4,126 డెత్ సర్టిఫికెట్లు జారీ అయినట్లు వెల్లడైంది. ఇందులో అత్యధికంగా మెహదీపట్నం (5877), చార్మినార్ (3949), బేగంపేట్ (2821), సికింద్రాబాద్ (1758) ప్రాంతాల్లో నకిలీ బర్త్ సర్టిఫికెట్లు జారీ అయినట్లు తేలింది. ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
Kishan Reddy:రూ.200 మందులు కొని రూ.21 ఫోన్ పే చేసిన కేంద్రమంత్రి