Sonam Wangchuk: ‘‘మాకు ఆస్పత్రిపై నమ్మకం లేదు’’..కోర్టుకు సోనమ్ వాంగ్‌చుక్ భార్య..
- సోనమ్ వాంగ్చుక్ను మరో ఆస్పత్రికి తరలించాలి..
- హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఆయన భార్య..
- చికిత్స పేరుతో నిర్బంధించాలని ఆరోపణ..
- ఆస్పత్రి నివేదికల్ని ప్రశ్నిస్తున్న గీతాంజలి ఆంగ్మో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonam Wangchuk: పేపర్ లీక్‌లకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన రాజీనామా కోరుతూ గత 20 రోజులుగా పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నిరాహారదీక్ష చేస్తున్నారు. దీంతో శనివారం ఆయనను ఢిల్లీ పోలీసులు జంతర్ మంతర్ నుంచి సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే, వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో, ఆస్పత్రిపై నమ్మకం లేదని, ఆయనను మరో ఆస్పత్రికి తరలించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. చికిత్స నెపంతో ఆయనను అక్రమంగా నిర్బంధించారని ఆమె ఆరోపించారు.
ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో, జంతర్ మంతర్ వద్ద సోనమ్ వాంగ్‌చుక్ తన నిరవధిక నిరాహార దీక్షలో 21వ రోజున ఉన్నప్పుడు అతడిని బలవంతంగా సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తీసుకువెళ్లారని గీతాంజలి పేర్కొన్నారు. గత 20 రోజులుగా అతని ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న కుటుంబ సభ్యులు, న్యాయవాదులు, వైద్యుల నుండి అతడిని వేరు చేశారని ఆమె తెలిపారు. ప్రస్తుత నిర్బంధ రాజ్యాంగ విరుద్ధమని ఆర్టికల్ 19,21 ఉల్లంఘన అని ప్రకటించాలని, అతడిని ఆస్పత్రి నుంచి తక్షణమే విడుదల చేయాలని లేదా కుటుంబం ఎంపిక చేసిన ఆస్పత్రిలో చేర్పించేలా ఆదేశించాలని పిటిషన్లో కోరారు.
Also Read
- Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
- PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
- Mamata Banerjee: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. నందిగ్రామ్ పోటీ నుంచి అభ్యర్థి విత్‌డ్రా..
- Suvendu Adhikari: మమతకు ‘‘శ్రీరాముడి శాపం’’.. బెంగాల్ సీఎం ఫైర్..
వాంగ్‌చుక్ భార్య ఆంగ్మో సోషల్ మీడియాలో ఆస్పత్రి యాజమాన్యంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన పొటాషియం స్థాయి 2.9కి పడిపోయిందని, ఇది ప్రాణాపాయ స్థాయి అని ఆస్పత్రి కుటుంబానికి తెలియజేసిందని ఆమె అన్నారు. ఆయన హెల్త్ బులెటిన్‌లో మాత్రం కేవలం పొటాషియం లెవల్స్ పడిపోతున్నాయని మాత్రమే చెప్పారని అన్నారు. చాలా గంటలపాటు వేడుకున్న తర్వాత, రాత్రి సుమారు 10:30 గంటలకు ఒక స్వతంత్ర ప్రయోగశాలలో రక్త నమూనాని పరీక్ష చేయించుకోవడానికి తమ కుటుంబానికి అనుమతి లభించిందని, ఆ నివేదికలో పొటాషియం స్థాయి 3.5గా తేలిందని, ఇది సాధారణ పరిధిలోనే ఉందని సోనమ్ వాంగ్‌చుక్ భార్య పేర్కొన్నారు. దీని ఆధారంగా, ఆమె ఆసుపత్రి వైద్య నివేదికను ప్రశ్నించారు. ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడానికి గానీ ఆసుపత్రి యాజమాన్యం నిరాకరిస్తోందని గీతాంజలి ఆరోపించారు. ఆస్పత్రి ఫ్లోర్లో 30 మంది పోలీసులు, ఆస్పత్రి అంతటా 100 మందికి పైగా భద్రతా సిబ్బంది ఉన్నారని, కుటుంబ సభ్యుల కదలికల్ని నియంత్రిస్తున్నారని ఆమె తెలిపారు.
I have lost faith in Safdarjung Government Hospital.
The hospital told us @Wangchuk66’s potassium had dropped to 2.9, describing it as alarming and life-threatening. Yet, in its public health bulletin, it conveniently omitted the actual number, referring only to "decreasing…— Gitanjali J Angmo (@GitanjaliAngmo) July 19, 2026
తాజావార్తలు
-
Warren Buffett: తండ్రి స్థానంలో కొడుకు.. వారెన్ బఫెట్ సామ్రాజ్యానికి కొత్త రారాజు ఇతడే!
-
Danam Nagender : దానం నాగేందర్ ఉదంతంపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
-
NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్‌స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
-
Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
-
PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..