తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి బీజేపీని బద్నం చేయాలని కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవితలు చూస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, మోడీ తెలంగాణకి వ్యతిరేకం అని ప్రచారం చేస్తున్నారని, తల్లిని చెల్లిని గౌరవించలేని భాష టీఆర్‌ఎస్‌ది అని ఆయన విమర్శించారు. ఉత్తర భారతం, దక్షిణ భారతం అన్న ప్రకాష్ రాజ్, కమలహాసన్ లు ఒడి పోయారని, ఉత్తర భారతనికి చెందిన బీజేపీ ఎంపీలు ఓటు వేస్తేనే తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో పాస్ అయిందని ఆయన గుర్తు చేశారు. 22 వేల కోట్లతో ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారులకు కేంద్రమంత్రి గడ్కరీ శంకుస్థాపన చేస్తున్నారని ఆయన అన్నారు.
అరె సన్నాసుల్లారా మీరు రాజకీయాలలోకి రాకముందే మోడీ ఒక రాష్ట్రానికి సీఎం.. సీఎంతో మాట్లాడడానికి ఓ స్థాయి ఉండాలని అంటున్న హరీష్ రావు… ఏ స్థాయి ఉండాలి అని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కిషన్ రెడ్డి పాత్ర ఏందో ప్రజలకు తెలుసునని, బీజేపీ విధానము చిన్న రాష్ట్రాలకు అనుకూలమని ఆయన అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఏపీ, తెలంగాణను కలుపుతారని కేటీఆర్ అంటున్నారని, మేము పాక్ ఆక్రమిత కశ్మీర్ ను భారత దేశంలో కలుపుతామని ఆయన అన్నారు. హైదరాబాద్ ని, జమ్మూ కాశ్మీర్ ను బలవంతంగా కలిపారని కవిత అన్నారని, తెలంగాణ వేరే దేశంగా ఉండాలని అనుకుంటున్నారా అని రఘునందన్ రావు ప్రశ్నించారు. హిజాబ్ వివాదానికి బీజేపీకి సంబంధం లేదు… నిషేధిత సంస్థకు చెందిన కొందరు చేసిన కుట్ర.. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు కుట్ర చేస్తున్నారు.. తెలంగాణ రెండు జాతీయ పార్టీలు సహకరిస్తే, 12 వందల అమరుల త్యాగాలతో పుట్టింది… కేసీఆర్, ఆయన కుటుంబం తెలంగాణ తమకే పుట్టిందని చెప్పుకుంటున్నారు అని ఆయన ధ్వజమెత్తారు. మీ నియోజక వర్గాలకు ఎన్ని నిధులు తీసుకెళ్లారో… మిగతా నియోజక వర్గాల్లో ఎన్ని గుండు సున్నాలు పెట్టారో చర్చకు సిద్ధమా హరీష్ రావు అని ఆయన సవాల్ విసిరారు.