CM Revanth Reddy: ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. పటాన్చెరు సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఓఆర్ఆర్ ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. వాహనం అదుపు తప్పి రోడ్డు మార్జిన్ గడ్డర్లను బలంగా ఢీకొట్టింది. అతివేగం, నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగింది. ఆమె మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఎమ్మెల్యే లాస్యనందిత మృతిపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లాస్యనందిత మృతి బాధకలిగించిందన్నారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలపారు.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మరణం పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంతాపం తెలిపారు. దివంగత ఎమ్మెల్యే స్వర్గీయ సాయన్న కుమార్తె కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత అతిపిన్న వయసులో ప్రజామన్ననలు పొంది ఎమ్మెల్యేగా గెలిచి ఈ రోజు రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం ఎంతో బాధాకరం అన్నారు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి… ఆమె ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణం అత్యంత బాధాకరమని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ టీపీసీసీ జగ్గారెడ్డి తెలిపారు. ఆమె మృతి పట్ల సంతాపం తెలిపారు. ఎంతో గొప్ప రాజకీయ భవిష్యత్ ఉన్న యువ ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో మరణించడం తీవ్ర విషాదం అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామన్నారు.
ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లాస్య మృతికి సంతాపం తెలిపారు. లాస్య అకాల మరణం బాధాకరం అన్నారు. ఆమె కుటుంబానికి అండగా ఉంటామన్నారు.
Read also: Manohar Joshi Dies: మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్ జోషి కన్నుమూత!
కంటోన్మెంట్ MLA లాస్య నందిత మృతి చాలా బాధాకరమని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మృతి వార్త తెలుసుకొని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. చిన్న వయసులోనే MLA గా గెలిచిన లాస్య మూడు నెలల్లోనే ఇలా అందరికీ దూరం అయిపోతారని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. లాస్య కుటుంబానికి ప్రగాఢ సంతాపం, సానుభూతిని తెలిపారు.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మృతి పట్ల రాష్ట్ర ఐటి పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు సంతాపం వ్యక్తం చేశారు. చిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజా ఆశీర్వాదం పొందిన నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం బాధాకరమని మంత్రి విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సబ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో ఆకస్మిక మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు.. లాస్య నందిత ఇటీవలే ఎమ్మెల్యేగా గెలిచి అంతలోనే ఈ లోకాన్ని విడిచి వెళ్ళడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ అవేదన వ్యక్తం చేశారు.. గత సంత్సరం వారి తండ్రి ఎమ్మెల్యే సాయన్న మరణం నుండి తెరుకొక ముందే అంతలోనే వారి కుమార్తె ఎమ్మెల్యే లాస్య నందిత కూడా ఇక లేరని వార్త మనందరినీ కలిచి వేస్తుంది.. లాస్య నందిత కుటుంబానికి దైర్యన్ని ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్న..ఎమ్మెల్యే లాస్య నందిత ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలిపారు.
లాస్య నందిత మృతిపై హరీష్ రావు, కేటీఆర్ సంతాపం తెలిపారు. యువ ఎమ్మెల్యేలను కోల్పోవడం బాధకారమన్నారు. కేటీఆర్.. ఎంతో భవిష్యత్తు కలిగిన కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందటం ఎంతో బాధాకరమన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అన్నారు.
Sundaram Master Review: వైవా హర్ష ‘సుందరం మాస్టర్’ రివ్యూ!