MLA Jagga Reddy: రాజకీయ హత్యలు చేసిన ఘనత బీజేపీది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Jagga Reddy Satyagraha Deeksha Against ED Cases: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీపై ఈడీ కేసులకు నిరసనగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీపై విరుచుకుపడ్డారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీని దూరం చేయడమే బీజేపీ ప్లాన్ అని, అందుకే కావాలని కుట్రలు పన్నుతోందని ధ్వజమెత్తారు. గుజరాత్లో అమిత్ షా, ప్రధాని మోదీ క్రిమినల్ కేసులున్నాయని.. కానీ కాంగ్రెస్‌లో ఉన్న వారు క్రిమినల్స్ కాదని అన్నారు. మోదీ, అమిత్ షా రాజకీయ, మత హత్యలు చేయించారని.. రాజకీయ హత్యలు చేసిన ఘనత బిజెపిది అని ఆరోపించారు.
అన్ని శాఖలను అదుపులో పెట్టుకొని, కాంగ్రేస్‌పై బీజేపీ కుట్ర పన్నుతోందని జగ్గారెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని ప్రజల మధ్యకు వెళ్లకుండా.. ఈడీ ఆఫీస్‌ల చుట్టూ తిప్పాలని బిజెపి ప్లాన్ చేస్తోందన్నారు. చిన్న చిన్న కారణాలతో సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను ఇబ్బంది పెడుతున్నారని.. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా అడ్డదారులు తొక్కుతోందని ఆగ్రహించారు. ఈ విచారణకు నిరసనగా శాంతియుతంగా ధర్నా చేస్తుంటే.. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీలను అరెస్ట్ చేస్తున్నారని.. ఇది నిజంగా దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు నేషనల్ హెరాల్డ్ పత్రికతో బీజేపీకి ఏం సంబంధం ఉందని ఆయన నిలదీశారు. ఆ పత్రిక స్వాతంత్రం కోసం పని చేసిందని.. అప్పట్లో బ్రిటీష్ వాళ్లు ఏం చేస్తున్నారన్న విషయాల్ని, రహస్యాల్ని యావత్ దేశానికి ఆ పత్రిక తెలియజేసిందని పేర్కొన్నారు.
Also Read
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
అలాంటి చరిత్ర కలిగిన ఈ పత్రికలో కామ, ఫుల్‌స్టాప్స్ లేకపోయినా.. వాటిని తప్పుగా ఈడీ చూపిస్తోందని జగ్గారెడ్డి వెల్లడించారు. 75 సంవత్సరాల తర్వాత ఈడీ కేసు నమోదు చేయడం హాస్యాస్పదమన్నారు. ఇంతకుముందు రాహుల్ గాంధీని, ఇప్పుడు సోనియా గాంధీని గంటల తరబడి ఈడీ ప్రశ్నిస్తోందని.. ఇది ఏమాత్రం సబబు కాదని నిలదీశారు. సోనియా, రాహుల్ సామాన్య పౌరులుగా జీవితం గడుపుతున్నారని.. గాంధీ కుటుంబానికి కాంగ్రెస్ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. సైనికుల్లాగా తామంతా పని చేస్తామని జగ్గారెడ్డి చెప్పారు.
తాజావార్తలు
-
Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్‌లోనూ ఉద్యోగ బాధ్యతలు
-
Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
-
Moto G Max: మోటో జీ మ్యాక్స్ భారత్‌లో త్వరలో లాంచ్.. 50MP Sony కెమెరా, Snapdragon చిప్
-
Jana Nayagan : బాక్సాఫీస్ డిజాస్టర్‌గా విజయ్ ‘జన నాయగన్’.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
ట్రెండింగ్
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!