Adulterated Mutton: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మటన్ మార్కెట్ లో నాణ్యతలేని కల్తీ మటన్ మాంసం విక్రయాల కలకలం రేపుతున్నాయి. మేక మెడపై కుక్క కరిచిన గాట్లను వినియోగదారులు గుర్తించడంతో విక్రయదారుల భాగోతం బయటపడింది. దీంతో వినియోగదారులు ప్రశ్నించడంతో పొంతలేని సమాధానం చెప్పాడు. అనంతరం బాన్సువాడ మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న మున్సిపల్ కమిషనర్ అలీమ్ మటన్ మార్కెట్ పరిశీలించారు. మటన్ మాంసం కల్తీ నాణ్యత గుర్తించి మాంసం స్వాధీనం చేసుకున్నారు.
Read also: Ileana D’Cruz : ఎట్టకేలకు పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన ఇలియానా..?
ఫుడ్ సేఫ్టీ అధికారులకు మున్సిపాలిటీ అధికారులు మాంసం శాంపిల్ పంపారు. రిపోస్ట్ ద్వారా చర్యలు తీసుకుంటామన్నారు. అయితే.. వినియోగదారులు ఆగ్రహంతో ఇలాంటి మాసం తింటే అనారోగ్యానికి గురవుతామని మండిపడ్డారు. మేక మెడపై కుక్క కరిచిన గాట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. అసలే కుక్కల దాడిలో ప్రజల ప్రాణాలు పోతుంటే.. ఇప్పుడు ఏకంగా కుక్క ఘాట్లతో వున్న మాసం ఎలా విక్రయిస్తారని ప్రశ్నించారు. అయితే కుక్కల దాడలో మేక మరణించిందని దానిని తక్కువ ధరకు తీసుకుని నాణ్యత లేకుండా అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read also: B Vinod Kumar: పార్లమెంటులో జాతీయ రహదారుల కోసం గళ మెత్తింది నేనే..
ధరలు పెరగడంతో వాటి స్థానంలో కల్తీ ఉత్పత్తులు దొరుకుతున్నాయని, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర ధరలు పెరిగిపోయాయని, ఇటీవల కొనుగోలు చేస్తున్న పప్పులు, పప్పులు కల్తీ చేసి విక్రయిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. పాల నుంచి నీళ్ల వరకు అన్నీ కలుషితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పామూరులోని గ్రామపంచాయతీ మటన్ మార్కెట్ తో పాటు పట్టణంలోని పలు ప్రధాన రహదారులపై మాంసం, చికెన్ దుకాణాలు ఉన్నాయి. రోడ్ల పక్కన ఉన్న దుకాణాలపై దుమ్ము ఎగిరి మాంసంపై పడుతోంది. కొందరు దుకాణదారులు రెండు, మూడు రోజులుగా ఫ్రిజ్ లలో గొర్రె, మేక మాంసాన్ని విక్రయిస్తున్నారు.
Read also: Warangal Mgm Hospital: మార్చురీలో పనిచేయని ఫ్రీజర్లు.. కుళ్లిపోతున్న మృతదేహాలు
మాంసం కిలో రూ.800 చొప్పున కొనుగోలు చేసిన కల్తీ అవుతుందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి మాంసాన్ని హోటళ్లు, దాబాలకు తక్కువ ధరకు ఇస్తున్నారని, అందుకే బిర్యానీలు, కూరల వంటకాలకు వినియోగిస్తున్నారని, తిన్న వారు అనారోగ్యం పాలవుతున్నారని వాపోయారు. ఇటీవల కలుషిత ఆహారం (ఫుడ్ పాయిజనింగ్) కారణంగా ఆసుపత్రుల్లో చేరిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. కొన్ని చోట్ల చనిపోతున్న మేకలు, గొర్రె పిల్లలు, కోళ్ల మాంసాన్ని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పట్టణంలో చికెన్ పకోడీ దుకాణాలు, చిన్నపాటి బిర్యానీ దుకాణాలు వెలిశాయి. కానీ వారికి ఫుడ్ లైసెన్స్ లేదు.
Fire Accident: కూకట్ పల్లిలో అగ్ని ప్రమాదం.. కూలర్ల షాప్ నుంచి ఎగిసిపడ్డ మంటలు..