నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఇస్సపల్లిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ వాహనం పై టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు, రైతులు రాళ్లతో దాడి చేశారు. అయితే..ఈ ఘటనపై టీఆర్‌ఎస్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పందిస్తూ ఎంపీ అరవింద్ పైతీవ్ర విమర్శలు చేశారు.బాండ్ పేపర్ మీద రాసి పసుపు బోర్డు తెస్తానని గెలిచాడని, రైతుల పంట చేతికి వచ్చింది.. రైతుల ఉగ్రరూపం బయటపడుతోందని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు.
Read Also: కరోనాతో అన్ని వ్యవస్థలు కూలిపోతాయనుకున్నాం: జయేష్ రంజన్
అరవింద్ చేసింది పాపం ఆయన చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందేనంటూ ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. రైతులకు మండితే ఇలాగే ఉంటుందన్నారు. పోలీసులు ఉదయం నుంచి ఎంపీ రక్షణలో ఉన్నారు. జగిత్యాల జిల్లాలో త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఉంటుందన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు మెడికల్ కాలేజ్‌ను కూడా ప్రాంభిస్తారని తెలిపారు.