తెలంగాణలో లష్కర్ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు రంగం కార్యక్రమంలో భవిష్యవాణి నిర్వహించారు. తెలంగాణ బోనాలు అనగానే తలసాని డ్యాన్స్ ఎలిమెంట్ ఠక్కున గుర్తుకొస్తుంది. బోనాలనేపథ్యంలో.. తెలంగాణ మంత్రి తలసాని మరోసారి తన కళాత్మకతను చాటుకున్నారు. తలసాని వెయ్ వెయ్ చిందెయ్ అంటూ తీన్‌మార్ దరువులకు స్టెప్పులు వేశారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఉత్సవాల్లో మిగతా భక్తులతో కలిసి మినిస్టర్ తలసాని చిందేశారు. అయితే గతంలో కూడా బోనాలు ఉత్సవాల్లో అనేకసార్లు జోష్ చూపించారు తలసాని శ్రీనివాస్ యాదవ్. తనయుడితో కలిసి కూడా డ్యాన్స్ చేసారు. లేటెస్ట్‌గా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఉత్సవాల్లో తలసాని డ్యాన్సింగ్ టాలెంట్ చూపించారు. తలసాని తీన్‌మార్ కు వేసిన స్టెప్పులు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా.. అక్కడున్న వారంతా మంత్రి డ్యాన్స్ చూసి ఫిదా అయిపోయారు. లష్కర్ బోనాల పండుగ కార్యక్రమంలో భారీ ఎత్తున భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి బోనాలతో మహిళల నృత్యాలు.. పోతురాజులు.. కొలాటం ప్రదర్శనలు భక్తులను అలరించాయి.
నేడు ఉదయం లష్కర్ బోనాల సందర్భంగా.. రంగంలో కార్యక్రమంలో అమ్మవారి భవిష్యవాని ప్రారంభమైంది. అవివాహిత అయిన జోగిని శరీరంపై ఆవహించిన అమ్మవారు రంగంలో భవిష్యవాణి చెప్పిన స్వర్ణలత. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో మొక్కుబడిగా పూజలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. నన్ను సంతోషంగా చేయడం లేదని, మీ సంతోషం కోసం పూజలు చేయండి, సరిగ్గా పూజలు జరపడం లేదని పేర్కొన్నారు. ప్రతీ ఏటా చెబుతున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. నాకు సక్రమంగా పూజలు జరిపించండి, శాస్త్రోక్తంగా నిర్వహించాలని కోరిన విషయం విధితమే..
DJ Tillu Sequel : ‘డిజె టిల్లు’ సీక్వెల్ నుంచి దర్శకుడు అవుట్!?