తెలంగాణలో లష్కర్ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు రంగం కార్యక్రమంలో భవిష్యవాణి నిర్వహించారు. తెలంగాణ బోనాలు అనగానే తలసాని డ్యాన్స్ ఎలిమెంట్ ఠక్కున గుర్తుకొస్తుంది. బోనాలనేపథ్యంలో.. తెలంగాణ మంత్రి తలసాని మరోసారి తన కళాత్మకతను చాటుకున్నారు. తలసాని వెయ్ వెయ్ చిందెయ్ అంటూ తీన్‌మార్ దరువులకు స్టెప్పులు వేశారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఉత్సవాల్లో మిగతా భక్తులతో కలిసి మినిస్టర్ తలసాని చిందేశారు. అయితే గతంలో కూడా బోనాలు ఉత్సవాల్లో అనేకసార్లు జోష్ చూపించారు…