Dinesh Karthik Hits longest six in IPL 2024: ఐపీఎల్ 2024లో భాగంగా సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ దినేశ్ కార్తీక్ రెచ్చిపోయాడు. 35 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో ఏకంగా 83 పరుగులు చేశాడు. 38 సంవత్సరాల వయస్సులో డీకే వీరవిహారం చేసి.. కొద్దిసేపు సన్‌రైజర్స్ జట్టును వణికించాడు. సన్‌రైజర్స్ గెలుపు ఖాయమని అందరూ అనుకుంటున్న సమయంలో కార్తీక్ వరుస సిక్సర్లతో ఆర్‌సీబీ అభిమానుల్లో ఆశలు రేకెత్తించాడు. అయితే 19వ ఓవర్లో పెవిలియన్ చేరడంతో ఆర్‌సీబీ ఓటమి ఖాయం అయింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఓటమి పాలైనప్పటికి.. కార్తీక్ మాత్రం అద్బుతమైన పోరాట పటిమతో అందరని ఆకట్టుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్ భారీ సిక్సర్ బాదాడు. ఏకంగా 108 మీటర్ల సిక్స్ కొట్టాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ టీ నటరాజన్ వేసిన 16వ ఓవర్ మొదటి బంతిని డీకే లెగ్ సైడ్ భారీ షాట్ ఆడాడు. బంతి ఏకంగా చిన్నస్వామి స్టేడియం పైకప్పుపై పడింది. ఐపీఎల్ 2024లో ఇదే అత్యధిక సిక్సర్ కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ 106 మీటర్ల సిక్స్ కొట్టాడు. వెంకటేష్ అయ్యర్, నికోలస్ పూరన్‌లు కూడా 106 మీటర్ల సిక్స్ బాదారు.
Also Read: Dinesh Karthik: లేటు వయస్సులో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు.. టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు పక్కా!
దినేశ్ కార్తీక్ బాదిన భారీ సిక్సర్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ షాక్ అయ్యాడు. బంతి స్టేడియం బయట పడడంతో ఏం కొట్టావ్ అన్నట్టు ఓ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. మరోవైపు బౌలర్ నటరాజన్ సహా అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డీకే భారీ సిక్సర్‌కు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. డీకే పెవిలియన్ చేరుతుండగా చిన్నస్వామి స్టేడియంకొని ఫాన్స్ అందరూ చప్పట్లతో అభినందించారు. మ్యాచ్ అనంతరం కమిన్స్ కూడా డీకేను అభినందించాడు.
Knock of a warrior!💥👏#DineshKarthik #RCBvSRH #TATAIPL #IPL2024 #BharatArmy pic.twitter.com/dien04f6ir
— The Bharat Army (@thebharatarmy) April 15, 2024