Minister Seethakka : మహిళా స్వయం సహాయక బృందాలకు శుభవార్త చెప్పిన మంత్రి సీతక్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి ఒక గ్రూపుకు వడ్డీ లేని రుణాలు ఐదు లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచుతున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు. ప్రతి ఒక మహిళా సంఘం తీసుకుని 10 లక్షల రూపాయల బ్యాంకు రుణాలకు వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తోందని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. అంతేకాకుండా.. మహిళా సంఘాల రుణాలకు ఈ ఏడాది వడ్డీల కోసం 2500 కోట్లు ఖర్చు చేస్తామని సీతక్క వెల్లడించారు. మహిళా ఉన్నత తెలంగాణ ప్రగతి అన్న నినాదంతో మా ప్రభుత్వం పని చేస్తుందని, మహిళల ఆర్థిక సాధికారత కోసం యజ్ఞంలా పని చేస్తున్నామని ఆమె తెలిపారు. మహిళలు పేదరికం నుంచి బయటపడినప్పుడే అభివృద్ధి పరిపూర్ణమవుతుందని, అందుకే వడ్డీ లేని రుణాలు ఇప్పించి ఆర్థికంగా మహిళలను ఎదిగేలా చేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే సంకల్పంతో పనిచేస్తున్నామని, అన్ని రంగాల్లో మహిళలకు మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పంట కొనుగోలు కేంద్రాల్లో 40% కేంద్రాలను మహిళా సంఘాలకు అప్పగించామని, ఈ ఏడాది 26 వేల కోట్లకు పైగా మహిళలకు బ్యాంకు రుణాలు ఇస్తామని ఆమె వెల్లడించారు.
అంతేకాకుండా.. ‘మహిళల ఆర్థిక సాధికారతలో ఇదో మైలురాయి.. లక్షలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా.. గతంలో మహిళలకు పట్టుమని పదివేల రూపాయల లోన్లు కూడా లభించకపోయేవి.. ఇప్పుడు ఆ మహిళలకి బ్యాంకులు లక్షలాది రూపాయలు ఇస్తున్నాయి.. పేదరికం వల్లే నేను నక్సలైట్లలో చేరాను.. వడ్డీ వ్యాపారుల దోపిడి కారణంగా సామాన్యులు నష్టపోయారు.. వారి బాధ చూడలేక నేను తుపాకిపట్టాను.. ఆ అనుభవంతోనే మహిళలకు వడ్డీ లేని రుణాలు కల్పించాలని సంకల్పంతో పనిచేస్తున్నాము.. ఇప్పటివరకు అర్హత గల మహిళా సంఘాలకు ఐదు లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు కల్పించాము.. ఇప్పుడు ఆ మొత్తాన్ని 10 లక్షల రూపాయలకు పెంచుతున్నాము.. మహిళల భారాన్ని దించేందుకు వడ్డీ భారం లేకుండా రెట్టింపు లోన్లు ఇస్తున్నాము.. బ్యాంకులకు మహిళా సంఘాలు రీ పే మెంట్ బాగా చేస్తున్నారు.. నిర్మల్ జిల్లా జీరో NPA సాధించింది.. DRDO విజయలక్ష్మి కి అభినందనలు.. నిర్మల్ జిల్లా తరహాలోనే అన్ని జిల్లాలు 100% బ్యాంకులకు రీపేమెంట్ చేయాలి.. బ్యాంకర్ల నమ్మకాన్ని విశ్వాసాన్ని మహిళా సంఘాలు నిలబెట్టాలి.. బ్యాంకర్లు మహిళా సంఘాలకు సరళమైన పద్ధతిలో లోన్లు ఇవ్వాలి.. బ్యాంకులకు మేము గ్యారెంటీ ఇస్తున్నాము.. పూర్తిస్థాయిలో రీపేమెంట్ చేసే బాధ్యత మాది.. వ్యక్తులకు లోన్ ఇస్తే ఎగ్గొట్టే ప్రమాదం ఉంటుంది.. అదే మహిళా శక్తికి సహకరిస్తే మీ డబ్బులకు భద్రత లభిస్తుంది.. మహిళా సంఘాలకు లోన్ లిస్టు సహకరిస్తున్న బ్యాంకర్లందరికి ధన్యవాదాలు..’ తెలిపారు మంత్రి సీతక్క
Also Read
- Sabita Indra Reddy: చీర లాగారు.. కింద పడేసి తొక్కారు.. జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశాం..
- IT Minister Sridhar Babu: రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలకు బిగ్ బూస్ట్.. కొత్త GCC పాలసీపై ఐటీ మంత్రి కీలక ప్రకటన
- High Court: జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాస్‌రెడ్డికి బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
- OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
తాజావార్తలు
-
Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
-
UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్‌బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
-
సొంతిల్లు లేని వారికి గుడ్‌న్యూస్.. రూ.8 లక్షల రుణాలపై 4% సబ్సిడీ.. PMAY-U 2.0 పథకం పూర్తి వివరాలు ఇవే..
-
Kuldeep Yadav: 10 వికెట్స్ పడగొట్టిన కుల్దీప్ యాదవ్.. గౌతమ్ గంభీర్ చూస్తున్నాడా?
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?