Upcoming Movies: టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా.. ఇయర్ ఎండ్‌లో థియేటర్లను షేక్ చేయనున్న భారీ చిత్రాలివే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Upcoming Movies: ‘రామాయణ’ భారీ విజయంతో నవంబర్ నెలను గ్రాండ్‌గా ప్రారంభించిన బాక్సాఫీస్.. రాబోయే వారాల్లోనూ అదే జోరును కొనసాగించేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో ఇయర్ ఎండింగ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు టాలీవుడ్ స్టార్ హీరోల భారీ చిత్రాలతో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులు విడుదలకు క్యూ కట్టాయి. వరుస రిలీజులతో రాబోయే రెండు నెలలు థియేటర్లలో పండగ వాతావరణం నెలకొననుంది.
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్ఠాత్మక మైలురాయిగా వస్తున్న ‘కింగ్ 100’ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు విజయ్ దేవరకొండ పక్కా మాస్ యాక్షన్ అవతారంలో నటిస్తున్న ‘రౌడీ జనార్ధన’, నాగచైతన్య డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న మిస్టికల్ థ్రిల్లర్ ‘విషకర్మ’ సినిమాలు కూడా బాక్సాఫీస్ బరిలో హాట్ టాపిక్‌గా మారాయి. వీరికి తోడుగా నటసింహం నందమూరి బాలకృష్ణ ‘దాదా’ కూడా డిసెంబర్ బరిలోనే దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఫ్యామిలీ, క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు శర్వానంద్ సరికొత్త మాస్ లుక్‌లో ‘భోగి’తో వస్తుండగా.. దుల్కర్ సల్మాన్ పీరియాడిక్ డ్రామా ‘ఆకాశంలో ఒక తార’ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇక యూత్ ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎంతగానో ఎదురుచూస్తున్న కల్ట్ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’తో పాటు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ డివైన్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘హైందవ’ సైతం ఇదే సీజన్లో థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అయ్యాయి.
Also Read
- Vijayasai Reddy: రెండు కుటుంబాల ఆధిపత్యానికి చరమగీతం పాడాలి.. PRP పవర్ చూపిస్తా.. సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
- Ramayana Box Office Collection: బాక్సాఫీస్ వద్ద 'రామాయణం' సునామీ.. 6 రోజుల్లోనే సరికొత్త రికార్డులు
- Vijayasai Reddy PRP Party: ఏపీ రాజకీయాల్లో కొత్త అధ్యాయం.. విజయసాయిరెడ్డి పార్టీ పేరు.. జెండా ఇదే..!
- Sonia Gandhi: "పెళ్లికి ముందు అమితాబ్ బచ్చన్ ఇంట్లోనే సోనియా గాంధీ".. ఆటోబయోగ్రఫీలో ఆసక్తికర విషయాలు
కేవలం టాలీవుడ్ చిత్రాలే కాకుండా నేషనల్, గ్లోబల్ లెవెల్ బిగ్గీస్ కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. రష్మిక మందన్న పవర్ఫుల్ యాక్షన్ రోల్లో నటిస్తున్న ‘మైసా’, బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ యాక్షన్ థ్రిల్లర్ ‘కింగ్’ చిత్రాలపై దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ నెలకొంది. వీటికి తోడుగా హాలీవుడ్ విజువల్ వండర్ ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా డిసెంబర్ రేసులో దిగుతుండటంతో ఈ ఏడాది ముగింపు బాక్సాఫీస్ లెక్కలు నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Upcoming Movies: టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా.. ఇయర్ ఎండ్‌లో థియేటర్లను షేక్ చేయనున్న భారీ చిత్రాలివే..!
-
Air India Hijack Threat: టేకాఫ్‌కు ముందే విమానంలో హైజాక్ నోట్.. కోల్‌కతా ఎయిర్‌పోర్టులో హై అలర్ట్!
-
Vijayasai Reddy: రెండు కుటుంబాల ఆధిపత్యానికి చరమగీతం పాడాలి.. PRP పవర్ చూపిస్తా.. సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
Ramayana Box Office Collection: బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ సునామీ.. 6 రోజుల్లోనే సరికొత్త రికార్డులు
-
Vijayasai Reddy PRP Party: ఏపీ రాజకీయాల్లో కొత్త అధ్యాయం.. విజయసాయిరెడ్డి పార్టీ పేరు.. జెండా ఇదే..!
ట్రెండింగ్
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!
-
రోల్స్ రాయిస్‌కు పోటీగా BYD కొత్త కారు.. 1,000+ కి.మీ. రేంజ్, 360 డిగ్రీలు తిరిగే BYD Yangwang Altior..!