SSC Exams: ఏపీలో పేపర్ లీక్‌లు.. అలెర్ట్ అయిన తెలంగాణ సర్కార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ఈ మధ్య జరిగిన టెన్త్ పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం కలకలం సృష్టించింది.. అయితే, ఈ నెల నుంచి తెలంగాణలోనూ టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.. దీంతో, అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.. పదో తరగతి పరీక్షలపై విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. పదవ తరగతి పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతీ పరీక్షా కేంద్రంలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా పరీక్షలను నిర్వహించాలని స్పష్టం చేశారు. మే 23వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలకు 5,09,275 మంది విద్యార్థులు హాజరుకానున్నట్టు వెల్లడించారు మంత్రి సబిత.
Read Also: Buddha Purnima: బుద్ధుని బోధనలను స్మరించుకున్న కేసీఆర్..
Also Read
- Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 19కు చేరిన తెలుగు పర్యాటకుల మృతుల సంఖ్య
- Train Accident: లోకో పైలట్ అప్రమత్తత.. తప్పిన రైలు ప్రమాదం
- Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 18 మంది తెలుగు టూరిస్ట్‌లు మృతి
- KTR: 117 సీట్లు కాదు.. కాంగ్రెస్‌కు 7 సీట్లు కూడా రావు.! కాంగ్రెస్‌పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు..
పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వర్తించే సిబ్బందిని కూడా మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో కేంద్రాల్లోకి అనుమతించకూడదని ఆదేశాలు జారీ చేశారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. పరీక్షల నిర్వహణ సందర్భంగా ఎలాంటి సమస్య ఉత్పన్నమైనా.. వెంటనే పరిష్కరించేందుకు వీలుగా రాష్ట్ర డైరెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించిన ఆమె.. పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే ఫిర్యాదు చేసేందుకు వీలుగా ప్రతీ పరీక్షా కేంద్రం వద్ద డీఈవో, ఎంఈవో ఫోన్ నెంబర్లను డిస్ప్లే చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటికే విద్యార్థులకు సంబంధించిన హాల్ టికెట్లను ఆయా పాఠశాలలకు చేర్చడం జరిగింది.. హెచ్ఎంలను కలిసి హాల్ టిక్కెట్లను పొందాలని విద్యార్థులకు సూచించారు.
ఇక, పరీక్షలు జరిగే సమయంలో విద్యుత్ ప్రసారంలో అంతరాయం కలగకూడదని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి సబిత.. విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్దకు సకాలంలో చేరుకునేందుకు అవసరమైన రీతిలో ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసేందుకు ఆయా జిల్లా కలెక్టర్లు చర్యలుచేపట్టాలి సూచించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రతీ పరీక్షా కేంద్రంలో ఒక ఏఎన్ఎం, ఒక ఆశా ఉద్యోగినిని ఓఆర్ఎస్ పాకెట్లు, అవసరమైన మందులతో సిద్ధంగా ఉంచుతున్నాం, పరీక్షల నిర్వహణకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించేందుకు వీలుగా జిల్లాల వారిగా పరిశీలకులను నియమించడం జరుగుతుందని తెలిపారు. ప్రతీ పరీక్షా కేంద్రంలో తాగునీరు, ఫర్నీచర్, విద్యుత్ సౌకర్యం, టాయిలెట్ సౌకర్యం ఉండేలా ముందస్తుగానే తనిఖీలను నిర్వహించాలని.. ఎక్కడైనా లోపాలున్నట్లయితే పరీక్షలను నిర్వహించే నాటికి వాటిని పరిష్కరించాలని స్పష్టం చేశారు.. ఇక, పదవ తరగతి పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నదని, విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరు కావాలని సూచించారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.
తాజావార్తలు
-
Idupu Kayitham: డిసెంబర్ ఫస్ట్ వీక్ లో “ఇడుపు కాయితం” రిలీజ్
-
Harry Brook: “టీమిండియాను వెనక్కి నెట్టేస్తాం.. నా టార్గెట్ ఇదే”.. కెప్టెన్ హ్యారీ బ్రూక్ బిగ్ స్టేట్మెంట్..
-
INS Mahendragiri: సాహో భారత్.. సముద్రాన్ని శాసించేందుకు వచ్చిన ‘INS మహేంద్రగిరి’! శత్రుదేశాల గుండెల్లో వణుకే..
-
Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 19కు చేరిన తెలుగు పర్యాటకుల మృతుల సంఖ్య
-
Bhagyasri Borse : ఏడ్చేసిన ‘లెనిన్’ హీరోయిన్.. అండగా నిలబడ్డారంటూ భాగ్యశ్రీ కన్నీళ్లు!
ట్రెండింగ్
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్‌తో రాబోతున్న Itel Zeno 100 Pro.!