Puvvada Ajay: పోలవరం ఎత్తు తగ్గించి.. ఆ మండలాలు మళ్ళీ కలపాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ (Puvvada Ajay kumar) కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు(polavaram Project)తో భద్రాచలానికి ముంపు ముప్పు వుందన్నారు. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముంపు పొంచి ఉందని.. ఇటీవల వచ్చిన వరద పరిస్థితులకు అదే కారణమని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. భద్రాచలం ముంపు ప్రాంతానికి శాశ్వత పరిష్కారం దిశగా త్వరలోనే చర్యలు చేపడతామని చెప్పారు. టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీలో విలీనమైన 7 మండలాలు.. భద్రాచలం పక్కనే ఉన్న ఐదు గ్రామాలూ తెలంగాణలో కలపాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీకి ఆ ఐదు గ్రామాలు దూరంగా ఉంటాయని.. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలన్నారు. పార్లమెంట్లో బిల్లు పెట్టి ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని కోరారు.
Minister Harish Rao: మోదీజీ.. పేదలు ఏం పాపం చేశారు?
Also Read
పోలవరం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు వదలడం ఆలస్యం కావడం వల్లే భద్రాచలం వద్ద వరద ఉధృతి పెరిగిందని చెప్పారు. భద్రాచలానికి ఇరువైపులా కరకట్టలను కట్టించేందుకు..ముంపు బాధితులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. వెయ్యి కోట్ల రూపాయలతో శాశ్వత ప్రాతిపదిక చర్యలు చేపట్టాలని సీఎం నిర్ణయించారని తెలిపారు. సీఎం పర్యటన సందర్భంగా కేసీఆర్ అనేక హామీలు ఇచ్చారని, ఇందుకు ఆయనకు ఉమ్మడి ఖమ్మం జిల్లా తరపున కృతజ్ఞతలు తెలిపారు. వర్షం పడుతున్నా.. వరద ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటించి బాధితులకు భరోసా ఇచ్చారని చెప్పారు.
పోలవరం ప్రాజెక్ట్ కోసం తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపారని..దీనిపై మొదటి నుంచి నిరసన తెలుపుతున్నామన్నారు మంత్రి పువ్వాడ అజయ్. వరదల నుంచి గిరిజనులను కాపాడుకోగలిగామని చెప్పారు. త్వరలో వరద సాయం బాధితుల ఖాతాల్లో చేరుతుందని మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. ఏపీ నుంచి కూడా ముంపు బాధితులు వచ్చి తమ పునరావాస శిబిరాల్లో తలదాచుకున్నారని మంత్రి గుర్తు చేశారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్యే నాగేశ్వర్ రావు, ఎమ్మెల్సీ తాత మధుతో కలిసి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!