Minister Prashanth Reddy’s sensational comments on YS Rajasekhar Reddy: మంత్రి ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్ వల్లే తెలంగాణ రాష్ట్రం ఆలస్యం అయిందని అన్నారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీని వీడతా అని కాంగ్రెస్ పార్టీని బ్లాక్ మెయిల్ చేశారంటూ విమర్శించారు. రాజశేఖర్ వల్లే తెలంగాణలో వందలాది మంది విద్యార్థులు అమరులయ్యారని అన్నాను. తెలంగాణ విషయంపై అప్పటి పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని బ్లాక్ మెయిల్ చేశారని అన్నారు.
Read Also: Retail Digital Rupee: రిటైల్ డిజిటల్ రూపీ ప్రారంభించనున్న ఆర్‌బీఐ.. కీలక విషయాలు ఇవే..
తెలంగాణ ఇస్తామని.. కాలయాపన చేస్తూ, మాట దాటివేస్తూ, తెలంగాణ పదం ఎత్తకపోవడం వల్ల, తెలంగాణ ఇస్తే నేను కాంగ్రెస్ పార్టీని వీడతా అని సోనియాగాంధీకి అల్టిమేటం ఇవ్వడం వల్ల తెలంగాణ ఆలస్యం అయిందని అన్నారు. సోనియాగాంధీ ఒప్పుకున్నా తెలంగాణ ఇవ్వలేకపోయిందని అన్నారు. తెలంగాణ విషయంలో తాత్సారం చేస్తున్నారని.. ఇచ్చిన మాట తప్పుతున్నారని చెప్పి, ఏ రాజకీయ నాయకుడు చేయలేని పనిని కేసీఆర్ చేశారని.. తనకున్న కేంద్ర మంత్రి పదవిని గడ్డిపోచలా విసిరేసి, ఏడాది, రెండు సంవత్సరాల కాలంలోనే రాజీనామా చేశారని.. ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు.
మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ అని.. మీతో అధికారంలోకి ఉండమని..మాది ప్రజా క్షేత్రం అని చెప్పి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారని.. తెలంగాణ ఇచ్చే వరకు కొట్లాడుతామని మన ఎమ్మెల్యేలు గ్రామాల బాట పట్టారని ఆయన అన్నారు. కాంగ్రెస్ నాన్చుడు వల్లే వందలాది మంది మరణించారని అన్నారు. వందలాది మంది బిడ్డలను పొట్టన పెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ అని ఆరోపించారు.