గిగ్ వర్కర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. శనివారం నాంపల్లి ఎగ్జిబిషన్‌లో గ్రౌండ్‌లో జరిగిన ఈ సమావేశానికి సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్న సంగతి తెలిసిందే. సమావేశం అనంతరం అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ‘గిగ్ వర్కర్స్ కోసం ఐదు లక్షల ఆక్సిడెంట్లు బీమా, 10 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రెండు నెలల క్రితం స్విగ్గి డెలివరీ కోసం వెళ్లి కుక్క దాడి చేయడంతో బిల్డింగ్ పైనుంచి పడి ఒక వ్యక్తి చనిపోయాడు. బాధితుడికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రెండు లక్షలు చెల్లించనున్నాము. గీక్ వర్కర్స్ కోసం ఒక ఆప్ ఆధారిత సర్వీస్‌ను ప్రారంభించబోతున్నాం.
మొదటగా గిగ్ వర్కర్స్ కి ఒక కనెక్టివిటీ ఉంది కాబట్టి ఇన్సూరెన్స్ పథకాలు వాళ్లకు అప్లై చేస్తున్న. త్వరలో ఇతర అన్ని ఆటో యూనియన్ ప్రతినిధులను పిలిపించి వారి సమస్యలను తెలుసుకొని ఒక నెట్వర్క్ ఏర్పాటు చేస్తాము. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వల్ల ఆటో డ్రైవర్స్ ఇబ్బంది పడుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఆటో డ్రైవర్ను ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఖచ్చితంగా వారి సమస్యలను పరిష్కరిస్తాము. తెలంగాణలో ఉన్న ప్రతి కార్మికుడి సంరక్షణ మా బాధ్యత. వేరే పార్టీల వాళ్లు ఆటో యూనియన్ వాళ్ళను రెచ్చగొట్టి తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు’ అని పేర్కొన్నారు.
అలాగే ఏఐసీసీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి మీడియాతో మాట్లాడారు. 27 నవంబర్ న హైదరాబాద్ లో రాహుల్ గాంధీ గిగ్ వర్కర్లను కలిశారు. ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక గిగ్ వర్కర్ల సమస్య లు తెలుసుకుంటా అన్నారు. అందులో భాగంగానే సీఎం , మంత్రుల కలిసి గిగ్ వర్కర్లు, మేనేజ్ మెంట్ తో సమావేశం అయ్యారు. గిగ్ వర్కర్లు వారి సమస్యలను నేరుగా సీఎం కు చెప్పుకున్నారు. గిగ్ వర్కర్లకు 5 లక్షల ప్రమాద బీమా,10 లక్షల ఆరోగ్య భీమా లను కల్పిస్తాం. గిగ్ వర్కర్ల కోసం కొత్త బిల్లు తీసుకొస్తాం. దేశ వ్యాప్తంగా కోటి మందికి పైగా గిగ్ వర్కర్లు ఉన్నారు’ అని అన్నారు.