హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డు ఎల్‌ఈడీ దీపాల వెలుగులో వెలిగిపోతోంది. ప్రభుత్వం తీసుకున్న భద్రత చర్యల కారణంగా ఔటర్ రింగు రోడ్డు కొత్త రూపు సంతరించుకుంది. హెచ్ఎండీఏ, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఓఆర్ఆర్‌పై 136 కిలోమీటర్ల మేర ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. నాలుగు ప్యాకేజీల్లో రూ.100.22 కోట్లతో ఏడేళ్ల వరకు ఆపరేషన్, మెయింటెనెన్స్ ఉంటుంది. జంక్షన్, అండర్ పాస్, రెండు వైపులున్న సర్వీస్ రోడ్లపై కిలోమీటర్ దూరంలో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు…