Minister KTR: ఫేక్ డీపీ మహిళలకు మాత్రమే కాదు రాజకీయ నేతలకు సైతం ప్రమాదమే అని మంత్రి కేటీఆర్ అన్నారు. బేగంపేట్ లోని గ్రాండ్ కాకతీయ హోటల్ లో ఫ్యూచర్ ఫార్వార్డ్ తెలంగాణలో భాగంగా “విమెన్ అస్క్ కేటీఆర్” ముఖాముఖి కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. మా ప్రత్యర్థులు ఫేక్ డీపి వాడి మాపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా ఒక్కోసారి టాక్సిక్ గా తయారవుతోందని తెలిపారు. మా ప్రతిపక్షాలు మాపై సోషల్ మీడియాని వాడుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్సార్ తో కలిసి సైబర్ క్రైమ్ లేజిస్లేషన్ తయారు చేస్తున్నామన్నారు. మాట్లాడే హక్కుని ఎదుటివారిని దూషించడానికి వాడకూడదన్నారు. మహిళకు సంబంధించిన సమస్యల కోసం ప్రత్యేకంగా ఒక హెల్ లైన్ ఏర్పాటు చేస్తే బావుంటుంది అనుకుంటున్నామన్నారు. మహిళలు తమ వివరాలు చెప్పకుండానే కంప్లైంట్ చేయొచ్చు, వాళ్ళ హక్కుల గురించి తెలుసుకోవచ్చు, మెంటల్ హెల్త్ సహాయం అందిస్తారని తెలిపారు. ప్రతి పక్షాలకు కూడా మేమే గెలుస్తామని తెలుసు కానీ వాళ్ళు నటిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 15 లోపు మహిళల కోసం ప్రత్యేకంగా ఒక అజెండా మీరే తయారు చేయండి అని తెలిపారు. అమలు చేయడానికి ప్రయత్నిద్దామన్నారు.
Read also: Bus Accident: బోల్తా పడిన బస్సు.. ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉందంటే..?
రాజకీయంగా కూడా చదువుకున్న మహిళలు వస్తున్నారు.. రావాలి కూడా.. అన్నారు. రక్షణ పరంగా ఇప్పటికే షి టీమ్స్ , టోల్ ఫ్రీ నంబర్ లాంటివి తీసుకొచ్చామని కేటీఆర్ అన్నారు. ప్రతి చిన్నారి పై 10వేలకు పైగా ఖర్చు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ లు 61% కి పెరిగాయన్నారు. మెటర్నల్ మోర్టాలిటీ తగ్గించామన్నారు. స్త్రీ నిధి కింద స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నామన్నారు. తెలంగాణ, ఏపీలలో మహిళలు స్త్రీ నిధి లోన్ లను మహిళలు 99 శాతం చెల్లిస్తున్నారని తెలిపారు. ఆ లోన్ తో వాళ్ళు వ్యాపారాలు ప్రారంభించి విజయం సాధిస్తున్నారు. మేనిఫెస్టోలో మహిళల కోసం ప్రత్యేకంగా పెట్టిన కొన్నింటిని పూర్తి చేసాము ఇంకా చేయాల్సిన ఉన్నాయని తెలిపారు. మహిళా యూనివర్సిటీ , కల్యాణ లక్ష్మీ , అమ్మఒడి సేవలు వంటివి తెచ్చామని గుర్తు చేశారు. నెగెటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న మహిళల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురానున్నామన్నారు. సుల్తాన్ పూర్, నందిగామసహా మొతం 4 చోట్ల ప్రత్యేకంగా మహిళల కోసం ఇండస్ట్రియల్ పార్క్స్ ఏర్పాటు చేసామన్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తే మహిళలకు చాలా తక్కువ వడ్డీతో లోన్ ఇస్తామన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన క్రీడాకార్లుల్లో ఎక్కువ మంది మహిళలే అని మంత్రి అన్నారు. మైనారిటీ పిల్లల కోసం ప్రత్యేక పాఠశాలలు ప్రారంభించామన్నారు.
Current Bill : ఈ చిన్న అలవాట్లను మార్చుకుంటే చాలు.. కరెంట్ బిల్ తక్కువగా వస్తుంది..