KTR Tweet: దీపస్తంభంగా తెలంగాణను నిలుపుతాం.. మాటిస్తున్నమంటూ కేటీఆర్ ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR Tweet: దీపస్తంభంగా తెలంగాణను నిలుపుతామని మాటిస్తున్నమంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ వైరల్ గా మారింది. ప్రపంచ ప్రజా ఉద్యమాల చరిత్రలోనే తెలంగాణ సాధన ఉద్యమం అత్యున్నతమైనదని, ప్రజాస్వామిక పోరాటాల నాయకుడని మంత్రి కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు. స్వపరిపాలన మాత్రమే కాకుండా ప్రజలందరికీ సుపరిపాలన ఫలాలు అందించడమే మన అమర వీరుల ఆశయమన్నారు. దశాబ్దాలుగా పేదలందరికి పట్టిపీడించిన సకల దరిద్రాలను శాశ్వతంగా దూరం చేస్తామన్నారు. అమర వీరుల ఆశయాలే స్ఫూర్తి అని, ప్రజల ఆత్మగౌరవ ఆకాంక్షలే ఊపిరి అని, తెలంగాణ ఉద్యమ నినాదాలే మైలురాళ్లని, తొమ్మిదేళ్ల ప్రగతికి నిదర్శనం చేసిన మహాయజ్ఞమని తెలిపారు.
Read also: Malaika Arora Hot Pics: వయసుతో పాటు పెరుగుతోన్న అందం.. మలైకా అరోరా హాట్ పిక్స్!
Also Read
దేశంలోనే అగ్రగామిగా ఎదిగింది తెలంగాణ రాష్ట్రమని తెలిపారు. భారత స్వాతంత్య్ర సమరయోధుల కలలు 75 ఏళ్లు దాటినా నెరవేరవని, తెలంగాణ రాష్ట్రం తొమ్మిదేళ్ల స్వల్ప కాలంలో అమర వీరుల ఆకాంక్షలను నెరవేర్చి రాబోయే వందేళ్లకు బలమైన పునాది వేసిందన్నారు. త్యాగధనులను ఎప్పటికీ మా గుండెల్లో నిలుపుకుంటామని, హైదరాబాద్ నడిబొడ్డున ప్రతిష్టించిన అమరవీరుల స్మారక చిహ్నంగా.. వెలుగుతున్న దీపం సాక్షిగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల సేవలో పునరంకితమవుతామని ప్రతిజ్ఞ చేస్తున్నామన్నారు. లక్ష్యం కోల్పోయిన భారతదేశానికి బాటలు వేసేందుకు తెలంగాణను దీటుగా నిలుపుతామని చెబుతున్నారు. తెలంగాణ అమరవీరులకు జోహార్.. జై తెలంగాణ, జై భారత్ అంటూ చేసిన మంత్రి కేటీఆర్ ట్వీట్ వైరల్ గా మారింది.
ప్రపంచ ప్రజాఉద్యమాల చరిత్రలోనే సమున్నతం..
ప్రజాస్వామిక పోరాటాలకు తలమానికం..
తెలంగాణ సాధనోద్యమంమన అమరుల ఆశయం..
కేవలం స్వపరిపాలన మాత్రమే కాదు…
సుపరిపాలన ఫలాలను సమస్త ప్రజలకు అందించడం..దశాబ్దాలుగా పట్టిపీడించిన..
సకల దరిద్రాలను శాశ్వతంగా దూరంచేసి…
తెలంగాణ సమాజాన్ని కష్టాల… pic.twitter.com/oSnz5OrT6D— KTR (@KTRBRS) June 22, 2023
తాజావార్తలు
-
Air India Offer: ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్.. విమాన ఛార్జీలపై 10 శాతం డిస్కౌంట్..
-
TRAI New Rules: జియో, ఎయిర్టెల్, వీఐలకు ట్రాయ్ షాక్! అక్టోబర్ 21 నుంచి చౌకైన రీఛార్జ్ ప్లాన్లు..
-
SS Karthikeya : “వారణాసి ఒక అగ్నిపర్వతం”
-
Rahul Gandhi: సీఈసీ కారణంగా ఆ 3 రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపించింది
-
SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!