Minister KTR: బీజేపీలో మున్నాభాయ్ ఎంబీబీఎస్ రకాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR: తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీలో చాలా మంది మున్నాభాయ్, ఎంబీబీఎస్‌లు ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ ఏం చదివారో బయటపెట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న తరుణంలో పలువురు బీజేపీ నేతల విద్యార్హతలు, వారి నకిలీ సర్టిఫికెట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో పలువురు బీజేపీ నేతల విద్యార్హతలపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. బీజేపీలో చాలా మంది మున్నాభాయ్ ఎంబీబీఎస్‌లు ఉన్నారని ఆరోపిస్తూ.. ఈ మేరకు మంగళవారం ట్వీట్ చేశారు. తెలంగాణకు చెందిన ఇద్దరు బీజేపీ ఎంపీలు కూడా నకిలీ సర్టిఫికెట్లు కలిగి ఉన్నారని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో తెలిపారు. వీరి వద్ద రాజస్థాన్, తమిళనాడు యూనివర్సిటీల పేరుతో నకిలీ సర్టిఫికెట్లు ఉన్నాయని చెబుతున్నారు. అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చి ఎన్నికల్లో గెలవడం నేరం కాదా? అని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రశ్నించారు. వాటిని పరిశీలించి దోషులుగా తేలితే అనర్హులు అవుతారా? అని లోక్ సభ స్పీకర్ ప్రశ్నించారు.
Looks like we have too many MunnaBhai, MBBS types in BJP
Also Read
- Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
- Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
- Telangana Sports : గాయత్రి-త్రిసాకు సీఎం రేవంత్ అభినందనలు.. గోపీచంద్‌తో స్పెషల్ మీట్
- Hyderabad Pan Masala Raid: హైదరాబాద్‌లో పాన్ మసాలా దందా.. రూ.160 కోట్ల స్కామ్..
2 BJP MPs from Telangana are also allegedly Fake Certificate holders 😄 Have forged certificates from Rajasthan & TN Universities
Isn’t it a criminal offence to lie in your election affidavit on whose basis MP gets…
— KTR (@KTRBRS) April 4, 2023
కాగా, డిగ్రీ సర్టిఫికెట్ల విషయంలో ప్రధాని మోదీ టార్గెట్ అంటూ బీఆర్ఎస్ నేతలు వ్యంగ్యస్త్రాలు వేస్తున్నారు. నా స్టడీ సర్టిఫికెట్లు చూపిస్తా’ అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. తాను పూణె యూనివర్సిటీ నుంచి బయోటెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేశానని, సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ నుంచి బిజినెస్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశానని తెలిపారు. మరోవైపు భారతదేశంలో నిజమైన డిగ్రీలు చదివిన వారికి ఉద్యోగాలు రావడం లేదని బీఆర్ఎస్ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. డిగ్రీలు లేని వారికి ఉన్నత ఉద్యోగాలు ఉన్నాయంటూ కవిత వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి మంత్రి కేటీఆర్ చేసిన ట్విట్ సంచలనంగా మారింది.
Attar shops in Hyderabad: రంజాన్ మాసం.. భారీగా వెలసిన అత్తర్ విక్రయాలు
తాజావార్తలు
-
Fanta: ఒకే బ్రాండ్.. రెండు దేశాలు.. కానీ చక్కెరలో భారీ తేడా!
-
Apple Mac mini M6: ఆపిల్ కొత్త Mac mini M6, Mac Studio M5 Max, M5 Ultra విడుదల.. 2nm చిప్, AI పవర్! ధర ఎంతంటే?
-
భారత్‌లో MG Hector Tomahawk రిలీజ్..కారు నుంచే ఇంటికి పవర్ సప్లై.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే!
-
Best Mileage Bikes: లీటర్‌కు 75 కి.మీ మైలేజ్.. రూ.60-80 వేల బడ్జెట్లో టాప్ 4 బెస్ట్ బైక్స్ ఇవే!
-
YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!