మౌలిక వసతుల్లో దేశంలోని ఇతర నగరాల కంటే హైదరాబాద్ ముందున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. నివాసయోగ్యమైన నగరాల్లోనూ హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందని చెప్పారు. నగరంలోని రాయదుర్గంలో ఉన్న నాలెడ్జ్ సెంటర్‌లో అమెరికాకు చెందిన కాల్‌అవే గోల్ఫ్ సంస్థ కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో కాల్‌అవే సంస్థ ఆఫీస్ ఏర్పాటవడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో డిజిటెక్ కంపెనీలు చాలా ఉన్నాయని కేటీఆర్ అన్నారు. శాండియాగోలో క్వాల్కం కేంద్ర కార్యాలయం ఉంది. సంస్థ…