హైదరాబాద్ పీవీ ఘాట్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన థ్రిల్ సిటీ పార్క్ ను తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, సీపీ అంజనీ కుమార్ లు కూడా పాల్గొన్నారు. విదేశాల్లో మాదిరిగా అన్ని రకాల గేమ్స్ ను నిర్వాహకులు అందుబాటులోకి తెచ్చారని… థ్రిల్ సిటీ పార్క్ హైదరాబాద్ కు కానుకగా మారుతుందని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అన్ని రకాల వయసుల వారికి వినోదాన్ని అందించే విధంగా పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో హెచ్ఎండీఏ, థ్రిల్ సిటీ ఈ పార్క్ ను తీర్చిదిద్దాయి.