NTV Telugu Site icon

KTR: మోడీ చెప్పేవన్నీ గాలి మాటలే.. పెంచిన ధరలకు దండం పెట్టాలి..

Ktr

Ktr

ప్రధాని నరేంద్ర మోడీ చెప్పేవన్నీ గాలి మాటలు మాత్రమే.. పెంచిన గ్యాస్ ధరలకు మోడీకి దండం పెట్టాలన్నారు తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్.. వరంగల్‌ జిల్లా నర్సంపేటలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో మొదటిసారిగా నర్సంపేట నియోజకవర్గంలో పైపుల ద్వారా ఇంటింటికీ నేచురల్ గ్యాస్ పంపిణీ ప్రారంభించాం.. నర్సంపేటలో తక్కువధరకు 12,600 గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం.. ఫ్యాక్షన్ రాజకీయాలు నడిచిన నర్సంపేటలో అభివృద్ధి చూపించిన ఘనత ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ది అన్నారు కేటీఆర్. తెలంగాణలో రెండేళ్ల వరకు ఎలాంటి ఎన్నికలు ఉండబోవన్న ఆయన.. కేసీఆర్ నాయకత్వంలో 14 ఏళ్లు కొట్లాడి తెలంగాణ సాదించుకున్నాం.. బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నాం.. దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా ఇంటింటికి నల్లా నీళ్లు ఇచ్చామన్నారు. బీడువడ్డ వరంగల్ భూములకు దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్టులతో సాగు నీరు ఇచ్చామన్న కేటీఆర్.. రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు.

Read Also: కెజిఎఫ్2′ హిట్ తో ‘సలార్’ ప్లాన్ లో మార్పు!

ఇక, 50 వేల కోట్ల రూపాయలతో రైతు బంధు ఇచ్చాం.. 22 వేల కోట్ల రూపాయాలతో రైతు రుణమాఫీ చేశామన్నారు మంత్రి కేటీఆర్.. నర్సంపేట అబివృద్ధికి మరో 50 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నామని ప్రటించిన ఆయన.. త్వరలోనే ప్రతిఊర్లో కొత్త పెన్షన్లు మొదలుపెడతామన్నారు. 973 గురుకుల పాఠశాలల్లో, 5 లక్షల విద్యార్థులకు 6 వేల కోట్లు ఖర్చు చేశామని.. కరోనా కారణంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఆలస్యం అయ్యాయని తెలిపారు ఇక, ప్రధాని నరేంద్ర మోడీ చెప్పేవన్నీ గాలి మాటలు మాత్రమేనని ఆరోపించిన కేటీఆర్.. పెంచిన పెట్రో, గ్యాస్ ధరలకు మోడీకి దండం పెట్టాలన్నారు.. కోటి మాటలు చెప్పి పది పైసల పనిచేయలేనిది బీజేపీ ప్రభుత్వమన్న ఆయన.. రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పి దేశంలోని నిరుద్యోగులను బీజేపీ మోసం చేసిందని మండిపడ్డారు.. మన కడుపులో బాధ కేసీఆర్‌కే తెలుస్తుంది.. ఇంటి పార్టీ టీఆర్ఎస్‌ను దీవించాలని విజ్ఞప్తి చేశారు మంత్రి కేటీఆర్‌.