Site icon NTV Telugu

Jupally Krishan Rao : తలతిక్క పనులు చేశారు కాబట్టే బీఆర్ఎస్‌ను ప్రజలు తిరస్కరించారు

Jupally Krishna Rao

Jupally Krishna Rao

Jupally Krishan Rao : ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో పర్యటించిన రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన బహిరంగంగా వ్యాఖ్యానిస్తూ, గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని ఆయన ఆరోపించారు. తలతిక్క పనులే బీఆర్ఎస్‌ను తిరస్కరించేలా చేశాయి అని జూపల్లి వ్యాఖ్యానించారు. ఇలాంటివి ఆదర్శ పాలనకు దూరమైన చర్యలు. ప్రజాస్వామ్యంలో నైతిక విలువలకే అవమానం అని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు సహా ఇతర కీలక అంశాల్లో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని, అందుకే కాళేశ్వరం పై విచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కమిషన్‌కు అవసరమైన అన్ని పత్రాలు సమర్పించబోతున్నామని అన్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధిపథంలోకి తీసుకురావడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. “రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోంది. ఎలాంటి ఎన్నికలు జరిగినా, కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు గెలుస్తుందనే నమ్మకం ఉంది” అని జూపల్లి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిపాలన ద్వారా మార్పులు తీసుకువస్తామని, పార్టీ నేతల మధ్య విభేదాలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. అందరూ కలిసి కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తామన్నారు.

CIBIL Score: సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని ఉద్యోగం నుండి తొలగింపు.. హైకోర్టు మద్దతు

బీజేపీపై విమర్శలు చేస్తూ, “తెలంగాణకు బీజేపీ చేసినదేమీ లేదు. బీహార్‌, ఉత్తరప్రదేశ్‌కు అధిక నిధులు కేటాయిస్తూ, తెలంగాణకు మొండి చేయి చూపుతోంది. ఎటువంటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు” అని మండిపడ్డారు. తెలంగాణ సాధనలో కాంగ్రెస్ పాత్రను గుర్తుచేస్తూ, “ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నష్టం జరిగినా, తెలంగాణ బిడ్డల ప్రాణత్యాగాలను చూసి మానవీయతతో సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించారు” అని జూపల్లి గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ – “అవి ప్రజావ్యతిరేక పాలనలే. అవినీతి, కుటుంబ పాలన, అప్రజాస్వామిక విధానాల వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారు” అని ధ్వజమెత్తారు. తాజా పరిస్థితిని ప్రస్తావిస్తూ – “రెవెన్యూలో తీవ్ర సమస్యలు ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీలను అమలు చేస్తున్నారు. గత ప్రభుత్వ పథకాల్ని కొనసాగిస్తూ ప్రజలపై నిబద్ధతను చూపిస్తున్నారు” అని మంత్రి వివరించారు.

Prashant Kishor: హీటెక్కుతున్న బీహార్ పాలిటిక్స్.. రాహుల్‌గాంధీకి సవాల్ విసిరిన ప్రశాంత్ కిషోర్

Exit mobile version