Site icon NTV Telugu

Jagadish Reddy: అభివృద్ధిని అడ్డుకునేందుకు బీజేపీ కుయుక్తులు పన్నుతోంది..

Jagadish Reddy

Jagadish Reddy

Jagadish Reddy: తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు బీజేపీ కుయుక్తులు పన్నుతోందని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. బీజేపీ ఆగడాలను అడ్డుకునేందుకు ప్రగతిశీల శక్తులతో కలిసి సాగుతున్నట్లు ఆయన వెల్లడించారు. విభజన రాజకీయాలతో దేశంలో మధ్యయుగం నాటి పరిస్థితులను తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. దీనిలో భాగంగా వామపక్షాలతో జతకట్టి ప్రత్యర్థులను చిత్తుచేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ రోజు నల్గొండ తెరాస నేతలతో పాటు సీపీఐ, సీపీఐ(ఎం) నాయకులతో మంత్రి జగదీష్ రెడ్డి సమన్వయ సమావేశం నిర్వహించారు.

CPI Narayana : ఆ యాప్‌ల కట్టడి చేయడంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు విఫలం

ఈ సమావేశంలో తెరాసతో పాటు సీపీఎం, సీపీఐ నేతలు చెరుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి సహా పలువురు పాల్గొన్నారు. మునుగోడు ఉప ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. బీజేపీకి మునుగోడు ఉపఎన్నికల్లోనే బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.

Exit mobile version