Harish Rao Thanneeru: సంగారెడ్డి జిల్లా గాంధీ కలగన్న కళకు నిదర్శనమని మంత్రి హరీష్ రావు అన్నారు. నేడు సంగారెడ్డి జిల్లా పర్యటలో సంగారెడ్డిలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో మంత్రి పాల్గొని ర్యాలీని ప్రారంభించి, 75 అడుగుల మువ్వెన్నల జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని పండుగలు కలిసి ఒక రోజు వస్తే ఎలా ఉంటుందో వజ్రోత్సవ వేడుకలు అలా జరుగుతున్నాయని ఆనందం వ్యక్తం చేసారు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు.. అన్నామో రామచంద్ర అన్నట్టు దేశంలో పరిస్థితి ఉండేదని, ఇప్పుడే ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని హర్షం వ్యక్తం చేశారు. ఆహార ఉత్పత్తిలో తెలంగాణ మొదటి స్థానములో ఉందని గుర్తు చేశారు. స్వంత ఆదాయ వృద్ధి రేటుతో దేశంలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని, ఇది మన టీఆర్‌ఎస్ పనితీరుకు నిదర్శనమని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకంటే విభిన్నంగా నిలిచింది తెలంగాణ అని పేర్కొన్నారు.
read also: Sonia Gandhi: సోనియా గాంధీకి మరోసారి కరోనా పాజిటివ్
మన రాష్ట్రా తలసరి ఆదాయం లక్ష 24 వేలు ఉంటే.. ఇప్పుడు 2 లక్షల 78 వెలతో అగ్రస్థానంలో ఉన్నాని ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడినప్పుడు మన బడ్జెట్ 62 వేల కోట్లు, గతేడాది లక్ష 24 వేల కోట్లు అని స్పష్టత ఇచ్చారు. ఏడేళ్లలో మూడింతల వృద్ధి రేటు సాదించినామన్నారు. కేంద్రం ఈ మధ్య అవార్డులు ప్రకటించిందని, సాంసద్ ఆదర్శ్ గ్రామ యోజనలో దేశంలో ఉత్తమ గ్రామాలు 20 ఉంటే అందులో 19 మన తెలంగాణావే అని ఆనందం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లాకు సీఎం కేసీఆర్ సంగమేశ్వర పథకంతో వరం ప్రకటించారని తెలిపారు. ఎల్లుండి నుంచి 57 ఏళ్లకే పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు హరీశ్ రావ్. స్వాతంత్ర్య ఫలాలు అందరికి దక్కాలంటే కులాలకు, మతాలకు అతీతంగా పని చేయాలని పేర్కొన్నారు.
read also: Komatireddy Venkat Reddy: సారీ కాదు.. సస్పెండ్ చేయాల్సిందే..!
ఈ మధ్య కొన్ని విచిన్నకర శక్తులు కులాల మధ్య, మతాల మధ్య విడదీసి రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నాయిని తెలిపారు. విచిన్నకర శక్తులతో జాగ్రత్తగా ఉండాలని హరీశ్‌రావ్ సూచించారు. కొంత మంది ఇలా చిచ్చుపెట్టి ఓట్ల రాజకీయం చేసి లాభం పొందాలని చూస్తున్నారని తెలిపారు. మనకు కులాలతో మతాలతో మతం పని లేదని అన్నారు. కులం, మతంతో పని లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. ఇంటింటికి మంచి నీరు ఇచ్చిన ఏకైక రాష్ట్రం, రైతులకు 24 గంటలు కరెంట్ ఇచ్చిన ఏకైక రాష్ర్టం తెలంగాణ అని తెలిపారు. అందరూ గాంధీ సినిమా చూడాలని పిలుపు నిచ్చారు. పార్టీ జెండాలను కింద పడేస్తాం.. కానీ జాతీయ జెండాను కింద పడేయవద్దని సూచించారు. జెండాను జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లి, ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ప్రజలకు హరీశ్ రావ్ కోరారు.
Bhadradri Kothagudem: వజ్రోత్సవాల్లో ప్రజాప్రతినిధుల “నాటు నాటు” డ్యాన్స్
