Site icon NTV Telugu

Harish Rao : ప్రభుత్వం నడుపుతున్నారా ? అబద్దాల ఫ్యాక్టరీ నడుపుతున్నారా ?

Minister Harish Rao Fired on Central Government.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని నడుపుతుందా లేదా అబద్దాల ఫ్యాక్టరీని నడుపుతుందా అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. గిరిజన రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదన బిల్లును కేంద్ర సర్కార్ తొక్కి పెట్టిందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ నుంచి గిరిజన రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదన రాలేదని చెప్పిన కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా తెలంగాణ గిరిజనులకు కేంద్రం క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు. కేంద్ర మంత్రి సమాధానం పై రేపు టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ ప్రివిలేజ్ మోషన్ ఇస్తారని ఆయన వెల్లడించారు.

గిరిజన రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా రేపు టీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. బిల్లు ఆమోదం అయ్యే దాకా బీజేపీని విడిచిపెట్టేది లేదని ఆయన వెల్లడించారు. తడిగుడ్డతో గొంతు కోస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ గిరిజన యూనివర్సిటీల్లో నిరసనలు చేపట్టాలని అన్నారు. పార్లమెంటు సాక్షిగా అబద్దాలు చెప్పిన మంత్రికి గ్రామగ్రామాన శవయాత్రలు జరపాలని పిలుపునిచ్చారు.

Exit mobile version