Harish rao: బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish rao: బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. గుజరాత్ లో ఎందుకు ఫసల్ బీమా యోజన అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఎకరాకు 10 వేల నష్ట పరిహారం ప్రకటించిన సీఎం కేసీఆర్, రైతు బిడ్డ అని మరోసారి నిరూపించారని ట్వీట్ చేశారు. రైతుల గురించి, వ్యవసాయం గురించి బిజెపి నేతలు మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లే అని విమర్శించారు. తెలంగాణలో ఫసల్ బీమా అమలు చేయాలని అడుగుతున్న బండి సంజయ్.. ముందు ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఎందుకు అమలు చేయడం లేదో చెప్పగలవా..? అంటూ ప్రశ్నించారు. దేశంలోని 10 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాలు ఫసల్ బీమాను వ్యతిరేకిస్తున్నాయని, పార్లమెంట్ సాక్షిగా బీజేపీ కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారు. దీనిని బట్టి చూస్తే ఆ పథకంతో రైతులకు పెద్దగా ఉపయోగం లేదని అర్థం కావడం లేదా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపంచారు.
CAG Report: కాగ్ నివేదిక… ఎన్నివేల కోట్లు మురిగిపోయాయంటే?
Also Read
- CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
- CM Revanth reddy: హిందూ, ముస్లింలు నా రెండు కళ్లు.. కేవలం మాటల్లో కాదు చేతల్లో చూపించామన్న సీఎం రేవంత్..
- Robbery: దొంగతనం చేసి అదే ఇంట్లో నిద్రపోయిన దొంగ.. హైదరాబాద్ లో ఘటన..
- Pocharam Srinivas Reddy: "అది నిరూపిస్తే రాజకీయం వదిలేస్తా".. పోచారం శ్రీనివాసరెడ్డి సవాల్
పంట నష్టపోయిన రైతులకు అండగా నిలిచేందుకు సీఎం కేసీఆర్ ఎకరాకు రూ. 10 వేలు సాయం చొప్పున, రూ. 228 కోట్లు ప్రకటించి రైతు బిడ్డనని మరోసారి నిరూపించుకున్నారని తెలిపారు. బిజెపి నేతలకు ఇది చిన్న సాయంగా కనిపించడం దురదృష్టకరమని అన్నారు. దేశంలో ఇంకెక్కడైనా ఇంతకన్నా ఎక్కువ సాయం చేసినట్టు నిరూపించగలరా? అని సవాల్ విసిరారు. నాడు అన్నదాత ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి, నేడు ఆదాని ఆదాయాన్ని డబుల్ చేశారని మండిపడ్డారు. అనునిత్యం రైతులను క్షోభకు గురి చేస్తూ, నల్ల చట్టాలు తెచ్చి రైతులను బలి చేసిన చరిత్ర మీదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయాన్ని పండుగలా చేసి, రైతును రాజుగా చేసిన ఘనత మాది. సాగు, రైతు సంక్షేమం గురించి బిజెపి నేతలు మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించడమే అంటూ మంత్రి హరీశ్ రావు, బండి సంజయ్ పై మండిపడ్డారు.
MLC Kavitha: మహిళా బిల్లును తీసుకురావాలి.. కవిత ట్వీట్ వైరల్
తాజావార్తలు
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
-
Ganja Smuggling: టెక్నాలజీతో గంజాయి దందా.. బాలానగర్‌లో గంజాయి స్మగ్లర్ల కొత్త స్కెచ్!
-
Be Alert: దంపతుల దారుణ హత్య..
-
Bihar: ఇన్‌స్టాలో ప్రేమ.. పెళ్లైన గంటల్లోనే వధువు మృతి.. ఏం జరిగిందంటే..!
-
Lalithaa Jewellery IPO: లలితా జ్యువెల్లరీ IPO వచ్చేసింది.. షేర్ ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!