Harish Rao: కాంగ్రెస్ ది.. ఫేక్ సర్వేలు.. తప్పుడు ప్రచారాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: కాంగ్రెస్ ఫేక్ సర్వేలు చేస్తున్నది. మాకే సీట్లు ఎక్కువ అంటూ తప్పుడు ప్రచారం చేస్తుందని మంత్రి హరీష్ రావు అన్నారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల దశ మారిందన్నారు.
నాడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన అంటే నేడు పోదాం పద బిడ్డ సర్కారు దవాఖాన అంటున్నారని తెలిపారు. బిచ్కుందకి డయాలసిస్ సేవలు తెచ్చామన్నారు. ఇప్పుడు వంద పడకల ఆసుపత్రి తెచ్చామని తెలిపారు. నాడు 30 శాతం ప్రభుత్వ డెలివరీలు ఉంటే నేడు అది 76.8 శాతానికి పెరిగిందన్నారు. మోడీ వచ్చి ఇష్టం వచ్చి మాట్లాడాడు. డబుల్ ఇంజిన్ ఫెయిల్ అయ్యిందన్నారు. పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర లో ఎలాంటి పరిస్థితి ఉందని, నాందేడ్ ఆసుపత్రిలో 40 మంది పిల్లలు చనిపోయారని తెలిపారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ సీఎం కేసీఅర్ ఏర్పాటు చేశారని మంత్రి అన్నారు. కర్ణాటకలో కళ్యాణ లక్ష్మి ఉందా? రైతు బంధు ఉందా, 24 గంటల కరెంట్ ఉందా? అని ప్రశ్నించారు. ఇక్కడ కరెంట్ లేదు అంటున్నారు వేలు పేట్టి చూస్తే తెలుస్తుందని మండిపడ్డారు. 3 గంటల కరెంట్ ఎలా సరిపోతుందో రేవంత్ రెడ్డి చెప్పాలని, 3 గంటల కరెంటు కావాలంటే కాంగ్రెస్, 24 గంటల కరెంట్ కావాలంటే బిఆర్ఎస్ కి ఓటు వేయాలని హరీష్ రావు అన్నారు.
ఢిల్లీలో ఇచ్చే అవార్డులన్ని తెలంగాణకు వస్థాయని తెలిపారు. కానీ గల్లికి వచ్చి తిడుతారని మండిపడ్డారు. సంక్షేమంలో స్వర్ణయుగం కేసీఆర్ పాలన ఉందన్నారు. కేసీఆర్ అంటే ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడని, ఒక పెద్ద దిక్కు అని అన్నారు. తెలంగాణ మీద ప్రేమ కేసీఆర్ కు ఉంటదా? రాహుల్ గాంధీకి ఉంటదా? అని ప్రశ్నించారు. పిల్లలకు ఉపాహారం ఇచ్చే అద్భుత పథకం ప్రారంభించామన్నారు. ఇతర రాష్ట్రాల్లో గొడ్డు కారంతో అన్నం పెడితే, సీఎం కేసీఅర్ విద్యార్ధులకు మమకారంతో అన్నం పెడుతున్నారని మంత్రి అన్నారు. ఎస్ఎఫ్టి చొప్పున బెంగళూరులో డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. అవినీతిలో కూడుకు పోయారు
మొన్న చెప్పిన హామీలు కర్ణాటకలో అమలు చేయలేని పరిస్థితి అన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టలేదని, 35 వేల కోట్ల రూపాయలు ఆపింది కేంద్రమని మండిపడ్డారు.
కాంగ్రెస్ ఫేక్ సర్వేలు చేస్తుందని, మాకే సీట్లు ఎక్కువ అంటూ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. గాంధీ భవన్ లో మొన్నటి దాకా అప్లికేషన్ కోసం డబ్బులు వసూలు చేశారు, ఇప్పుడు సీట్లు అమ్ముకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని ట్రిక్కులు చేసిన హ్యాట్రిక్ కొట్టేది కేసీఆర్ అని మంత్రి హరీస్ అన్నారు.
Kishan Reddy : ఓవైసీ కుటుంబానికి కట్టు బానిసలుగా బీఆర్ఎస్ వ్యవహరిస్తుంది
Also Read
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!