Minister KTR: కేయూ విద్యార్థులకు క్షమాపణ చెప్పిన మంత్రి కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: కేయూలోని పరిణామాలను మంత్రి కేటీఆర్ కు విద్యార్థులు వివరించారు. దీంతో స్పందించిన కేటీఆర్ యూనివర్సిటీలో జరిగిన పరిణామాల నేపథ్యంలో విద్యార్థులకు జరిగిన ఇబ్బందులపై క్షమాపణ చెప్పారు. రాంపూర్ లో ఐటి పార్క్ వద్ద మంత్రి కేటీఆర్ ను కేయు విద్యార్థులు కలిశారు. విద్యార్థుల డిమాండ్స్ పై సానుకూలంగా స్పందించారు. విద్యార్థులపై పెట్టిన కేసులు నెత్తివేయాలని సిపికి ఆదేశించారు. యూనివర్సిటీలోని సమస్యలపై ఉన్నత విద్యాశాఖ ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆశావర్కర్ల సేవలు గుర్తున్నాయ్.. త్వరలో పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. వరంగల్ లో మంత్రి పర్యటన కొనసాగుతుంది. రాంపూర్ ఐటి పార్క్ లో Quadrant టెక్నాలజీ సాప్ట్ వేర్ కంపెనీ ని ప్రారంభించారు.
అనంతరం ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రిని ఆశా వర్కర్లు కలిసి మాట్లాడారు. దేశంలో ఎక్కడలేని విధంగా ఆశ వర్కర్లకు జీతాలు ఇస్తున్నామని తెలిపారు. ఎవరో.. రెచ్చకోడితే మీరు ధర్నాలు చెయ్యకండని సూచించారు. కారోన టైంలో మీరు చేసిన సేవలు గుర్తు ఉన్నాయన్నారు. త్వరలో ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. అనంతరం హన్మకొండ ప్రగతినగర్ లోని 15 MLD STP , సేవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ (మురుగునీటి శుద్ది కేంద్రం) ను, నిట్ ప్రాంతంలో జంక్షన్ ను, రూ. 30 లక్షల నిధులతో నిర్మించిన ఎన్ఐటి జంక్షన్, మడికొండ ఐటీ పార్క్ లో క్వాడ్రాంట్ సాప్ట్ వేర్ కంపెనీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో.. మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి, ఎమ్మెల్యేలు, ఎంపీ దయాకర్ పాల్గొన్నారు.
Shraddha Kapoor: ప్రభాస్ నటికి ఈడీ సమన్లు.. విచారణకు హాజరవుతారా?
Also Read
తాజావార్తలు
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!