Site icon NTV Telugu

Harish Rao: డబుల్ ఇంజన్ పాలన అంటే తిరోగమన పాలన

Harish Rao

Harish Rao

డబుల్ ఇంజన్ పాలన అంటే తిరోగమన పాలన అంటూ బీజేపీ పై మంత్రి హ‌రీష‌ రావు మండిప‌డ్డారు. అమిత్ షా నిధులు మీకు అందాయా అని అడిగే కంటే ముందు, తెలంగాణ కు ఇవ్వాల్సిన నిధులు ఇచ్చారా చెప్పండని ప్ర‌శ్నించారు. నియామకాల గురించి మాట్లాడే నైతిక హక్కు బిజెపి కి లేదని మండిప‌డ్డారు. మోడీ రెండు కోట్ల ఉద్యోగాల నియామకాల ప్రకటన బోగస్ అంటూ విమ‌ర్శించారు. మా వైపు ఒక్క వేలు చూపిస్తే.. మీ వైపు రెండు వేళ్లు చూపిస్తామంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. నీళ్లు ,నిధుల ,నియామకాల గురించి అడిగే హక్కు బిజెపి నేతలకు లేదని మండిప‌డ్డారు. కేంద్రంలో ఎన్ని జాబ్ లు ఇచ్చారో స్పష్టం చేయండని ప్ర‌శ్నించారు హ‌రీష్ రావ్‌. పెంచిన సిలిండర్ ధరల గురించి మోడీ ఎందుకు మాట్లాడలేదు ? అని ప్ర‌శ్నించారు. చట్టసభల్లో మహిళల రిజర్వేషన్లు ఏమి చేశారు ? మోడీ ఒక్క మాట మాట్లాడలేదని ఎద్దేవ చేసారు.

read also: Satyadev: ‘గుర్తుందా శీతాకాలం’ మరోసారి వాయిదా!

ఇరిగేషన్ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఎటువంటి సహకారం లేదు .. ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని నిప్పులు చెరిగారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఇచ్చారు.. ఇదే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ఈ ప్రాజెక్టులో అవినీతి లేదని స్పష్టం చేసిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఎనీ టైం వాట‌ర్ అంటూ హ‌రీష్ రావ్ అన్నారు. పీయూష్ గోయల్ ఎందుకు బియ్యం తీసుకోవడం లేదో చెప్పాలి కదా ? అని ప్ర‌శ్నించారు. బీజేపీ సభ ద్వారా తెలంగాణ సర్కార్ పై బురద చల్లే ప్రయత్నం చేసిందని మండిప‌డ్డారు.

read also: Somu Veerraju : దుష్టశక్తులు భారీ కుట్ర పన్నాయి..

మోడీ సర్కార్ అన్ని రంగాల్లో విఫలం అయ్యిందని విమ‌ర్శించారు. యూపీతో పోల్చితే తెలంగాణ తలసరి ఆదాయం మూడు రెట్లు ఎక్కువగా ఉందని గుర్తు చేసారు. అమిత్ షా తెలంగాణ రాష్ట్ర సర్కార్ స్కీమ్ లబ్ధిదారులను అడిగితే నిధులు అందినవ లేదా తెలుస్తుంద‌ని అన్నారు. అమిత్ షా ముందు తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వాలని పేర్కొన్నారు. బీజేపీ నిన్న సభ పెట్టి 24 పైసలు తెలంగాణ కు ప్రకటించలేదని మంత్రి హ‌రీష్ మండిప‌డ్డారు.

Exit mobile version