ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా మంత్రి హరీష్‌రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా ఆర్థిక మంత్రి హరీష్‌రావు ఎన్నికయ్యారు.. ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా మంత్రి హరీష్‌రావు ఎన్నికయినట్లు ఎగ్జిబిషన్ సొసైటీ యాజమాన్య కమిటీ ప్రకటించింది.. ఇక, తమ విన్నపాన్ని మన్నించి అధ్యక్షుడిగా ఉండేందుకు అంగీకరించినందుకు కమిటీ సభ్యులు మంత్రి హరీష్ రావును ఆయన నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. ఎగ్జిబిషన్ సొసైటీని మరింత ముందుకు తీసుకెళ్తానని ప్రకటించారు.. ఎగ్జిబిషన్ సొసైటీని మరింత ప్రగతి పథంలో నడిచేలా శక్తివంచన లేకుండా పని చేస్తానని.. తనను కలిసిన సోసైటీ యాజమాన్య కమిటీ ప్రతినిధులతో తెలిపారు.
నా బాధ్యత మరింత పెరిగిందన్న మంత్రి హరీష్‌రావు.. ప్రతిష్టాత్మక సంస్థను అందరం కలిసి ముందుకు తీసుకెళ్దామన్నారు.. గత 80 ఏళ్లుగా ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ను ఘనంగా నిర్వహిస్తున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నుమాయిష్ ను విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందేలా కలిసి పని చేద్దామన్నారు. సొసైటీ ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థల ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, వృత్తి నైపుణ్యం మెరుగుపడి ఉపాధి అవకాశాలు పొందేలా చేద్దామన్నారు హరీష్‌రావు.. కాగా, గతంలో ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఉన్నారు.. ఆయన మంత్రి పదవి కోల్పోవడం.. ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి, ఇతర పదవులకు కూడా రాజీనామా చేశారు. ఇక, ఆ తర్వాత కొన్ని అక్రమాలు జరిగాయంటూ.. ఏసీబీ సైతం పలు సందర్భాల్లో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
Also Read
తాజావార్తలు
-
Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
-
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
-
Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
-
Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
-
Smart Phone: 6000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్, 90Hz డిస్‌ప్లే , 12GB ర్యామ్.. మార్కెట్లోకి కొత్త ఫోన్..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..