MEN Menstrual Pain: నెల వచ్చే సరికి మహిళలు నెలసరి సమయంలో కడుపు నొప్పి అస్సలు భరించలేరు. నెలసరి నుంచి కనీసం మూడు రోజులైనా ఆనొప్పి భరించలేక నకరయాతన అనుభవిస్తుంటారు. ఆనొప్పిని భరించేందుకు ఎన్ని మాత్రలు వేసుకున్న ఆఒక్క క్షణం మాత్రమే కాస్త మనస్సాంతి అనిపించిన మళ్లీ ఆనొప్పి మహిళలు భరించాల్సిందే. అయితే నెలసరి సమయంలో మహిళలు అనుభవించే కడుపు నొప్పి తీవ్రతను పురుషులు అనుభూతి చెందేలా వరంగల్ నిట్‌లోని ట్రిపుల్ విద్యార్థులు ఓ పరికరాన్ని తయారు చేశారు. దీనికి ‘డేర్ టూ ఫీల్’ పేరుతో రూపొందించింది. ఈ పరికరం బహిష్టు సమయంలో మహిళల్లో కలిగే నొప్పిని పురుషులకు అనుభవపూర్వకంగా తెలియజేస్తోంది.
Read also: Boy Missig: ఈ నగరానికి ఏమైంది? నిన్న ఇందు.. నేడు నసీర్ మిస్సింగ్
దీంతో.. ఈ పరికరంలోని అతుకుల పట్టీలను మగవారి పొట్టకు అతికించి, నాబ్ ద్వారా ఈ పట్టీలతో పొట్టపై ఒత్తిడి కలుగజేస్తారు. దీని.. ఫలితంగా కలిగే నొప్పి ఆడవాళ్లు నెలసరి సమయంలో అనుభవించే నొప్పిలాగే ఉంటుంది. ఈ పరికరం నిట్ టెక్నోజియాన్-22లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రెండేళ్ల కరోనా కల్లోలం తర్వాత నిట్‌లో మళ్లీ సాంకేతికోత్సవాలు ప్రారంభమయ్యాయి. ‘జ్ఞానం కోసం తపన’ అన్న ఇతివృత్తంతో శుక్రవారం టెక్నోజియాన్ మొదలైంది. అయితే.. దేశం నలుమూలల నుంచి ఆరువేల మందికి పైగా విద్యార్థులు టెక్నోజియాన్‌కు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో.. తమ ఆవిష్కరణలను ప్రదర్శిస్తున్నారు. కళ్లు చెదిరే వస్త్రధారణ, డాన్స్‌లు, సాంస్కృతిక కార్యక్రమాలతో హంగామాతో టెక్నోజియాన్-22ను 3 రోజుల పాటు నిర్వహించనున్నారు.
Read also: Man Wakes Up From Dead: నోట్లో పాలు పోశారు.. శవం లేచి కూర్చుంది
టెక్నాలజీ ఫెస్టివల్‌లో సాంకేతిక నిపుణులు మాతృభాషపై తమ సత్తా చాటారు. ఎన్‌ఐటీలోని లిటరేచర్ డిబేటింగ్ క్లబ్ విద్యార్థులు తెలుగు సాహిత్యంపై ఆసక్తిని పెంచేందుకు కృషి చేస్తున్నారు. భాషపై ఆసక్తిని పెంచేందుకు తెలుగులో వక్తృత్వం, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తారు. నిట్ ఈఏ క్లబ్ విద్యార్థులు ‘లేజర్ మేజ్’ అనే రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఇందులో లేజర్ కిరణాల ద్వారా నిర్దేశిత ప్రాంతం చుట్టూ ఏర్పాటు చేస్తారు. ఆ ప్రదేశానికి వెళ్లాలంటే లేజర్ మేజ్‌ను దాటుకొని వెళ్లాలి. ఎవరైనా అనుమతి లేకుండా వెళితే వెంటనే బీప్ శబ్దం వస్తుంది. రక్షణ రంగంలో ఉపయోగం కోసం ఇది ఉపయోగపడుతుందని నమ్ముతారు. గ్రామీణ ప్రాంత ప్రజలు తమ అవసరాల కోసం సొంతంగా చేస్తున్న ఆవిష్కరణలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు నిట్ వరంగల్ విద్యార్థులు ‘హనీబీ నెట్‌వర్క్ చాప్టర్’ను రూపొందించారు. కొత్త ఆవిష్కరణలను ఈ అధ్యాయంలో చేర్చడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని ఆవిష్కరణలను ప్రపంచానికి తెలియజేస్తూ ప్రోత్సహిస్తున్నారు. అయితే నెలసరి నొప్పిని పురుషులు భరించగలరా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏదైతే నేం మహిళలే కాకుండా పురుషులు కూడా నెలసరి నొప్పి భరించే కొత్త ఆవిష్కరణకు రూపుదిద్దుకున్న విద్యార్థులకు పురుషులు ఈనెలసరి నొప్పిని భరించే తీరును చూసేందుకు తీవ్ర ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.
ChandraBabu: గుంటూరు డీఐజీకి చంద్రబాబు ఫోన్.. మాచర్ల పోలీసులపై చర్యలకు డిమాండ్