Jasprit Bumrah set to be rested for IND vs ENG Ranchi Test: రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ప్రస్తుతం టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇక భారత్, ఇంగ్లండ్ మధ్య రాంఛీ వేదికగా నాలుగో టెస్టు జరగనుంది. ఫిబ్రవరి 23 నుంచి నాలుగో టెస్టు ఆరంభం కానుండగా.. మంగళవారం భారత జట్టు రాంఛీకి చేరుకోని బుధవారం నుంచి ప్రాక్టీస్ చేయనుంది. అయితే ఈ టెస్టుకు టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా దూరం కానున్నట్లు తెలుస్తోంది.
వర్క్‌లోడ్ కారణంగా జస్ప్రీత్ బుమ్రాకు నాలుగో టెస్టులో విశ్రాంతి ఇవ్వాలని టీమ్ మేనెజ్‌మెంట్ నిర్ణయించుకున్నట్లు క్రిక్‌బజ్ తమ కథనంలో పేర్కొంది. రాజ్‌కోట్ నుంచి నేరుగా అతడు తన స్వస్థలం అహ్మదాబాద్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. ఐదో టెస్టుకు కూడా బుమ్రా అందుబాటులో ఉంటడా? అన్నది కూడా అనుమానమే. యార్కర్ కింగ్ బుమ్రా ఆఖరి టెస్టు ఆడడం నాల్గవ టెస్ట్ ఫలితంపై ఆధారపడి ఉంటుందట. బుమ్రా సోమవారమే అహ్మదాబాద్ బయలేదేరనున్నాడని తెలుస్తోంది.
Also Read: IND vs ENG: కుటుంబానికే మొదటి ప్రాధాన్యత.. రెండో ఆలోచన ఉండదు: రోహిత్
ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లో జస్ప్రీత్ బుమ్రా దుమ్మురేపుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన మూడు టెస్టుల్లో 17 వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్‌లో లీడింగ్ వికెట్ టేకర్ కూడా బుమ్రానే. నాలుగో టెస్టులో యువ పేసర్ ఆకాష్ దీప్ అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. మొహమ్మద్ సిరాజ్ ఫ్రంట్ లైన్ పేసర్‌గా కొనసాగనున్నాడు. అశ్విన్, జడేజా, కుల్దీప్ స్పిన్ కోటాలో ఆడతారు. ఫిబ్రవరి 23 నుంచి టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సొంత మైదానం రాంఛీలో నాలుగో టెస్టు ప్రారంభం కానుంది.