Medak: ప్రస్తుతం ఎలాంటి రుణాలు తీసుకున్నా ఈఎంఐ పద్ధతిలో చెల్లించేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు. క్రెడిట్ కార్డుల వినియోగమూ పెరిగింది. దీంతో నెలవారీ వాయిదా పద్ధతి ఈఎంఐ అంటే తెలియని వారు ఉండకపోవచ్చు. ఇచ్చిన గడువులోపు ఈఎంఐ చెల్లిస్తే ఎలాంటి అదనపు భారం ఉండదు. కానీ, ఈఎంఐ చెల్లించడం ఆలస్యమైతే నరకం చూడాల్సిందే. లోన్ ఈఎంఐ గడువు ఒక్కరోజు ఆలస్యమైతే అనుకున్నదానికంటే ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ఇది పలువురికి తెలియక ఈఎంఐ కట్టేందుకు ఒకరోజే కదా కట్టేద్దాం అనుకుంటారు. కానీ దానికి డబుల్ కట్టాల్సి వస్తుందని ఊహించరు. అయితే.. ఈఎంఐ కట్టలేదని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ వేధింపులకు ఓ యువకుడు బైక్ తగలబెట్టిన ఘటన మెదక్ జిల్లా శివంపేటలో జరిగింది.
Read also: Suryapet: అన్నారం ఐకేపీ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. రైతు దంపతులు ఆత్మహత్యాయత్నం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా శివంపేటలో ఉంటున్న ఓ యువకుడు ఈఎంఐ ద్వారా ఓ బైక్ ను కొనుగోలు చేశాడు. అయితే ప్రతి నెల ఈఎంఐ కట్టుకుంటూ వచ్చాడు. కాగా.. ఈనెల కొన్ని కారణాల వల్ల బైక్ ఈఎంఐ కట్టలేక పోయాడు. దీంతో ఫైనాన్స్ సంస్థ ఏజెంట్ల నుంచి కాల్స్ రావడం మొదలయ్యాయి. తాను కడతానని కాస్త సమయం ఇవ్వాలని యువకుడు కోరాడు. అయితే ఫైనాన్స్ సంస్థ ఏజెంట్లు మాత్రం వినలేదు. బైక్ ఈఎంఐ చెల్లించాల్సిందే అని చివరకు ఆ యువకుడి ఇంటికి వచ్చారు. ఇంటి వద్ద బైక్ ఈఎంఐ కట్టాలని నానా రచ్చచేయడమే కాకుండా బెదిరించారు. దీంతో మనోవేదనకు గురైన యువకుడు ఫైనాన్స్ సంస్థ ఏజెంట్ల ముందే బైక్ కి నిప్పు పెట్టాడు. బైక్ పూర్తీగా దగ్దం అయ్యింది. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక సమాచారంతో ఘటన వద్దకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు ఏం జరిగింది అనేది ఆరా తీస్తున్నారు. యుకుడు, ఫైనాన్స్ సంస్థ ఏజెంట్లు ఇచ్చిన ఆధారాలతో ఫిర్యాదు నమోదు చేసినట్లు తెలిపారు.
KTR Comments: ఈనెల 29 తెలంగాణ ప్రజలు మరిచి పోలేని రోజు..