NTV Telugu Site icon

Raghunandan Rao: ఢిల్లీలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే

Raghunandanrao

Raghunandanrao

దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు. రఘునందన్‌రావు మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ ప్రజల మూడ్ బీజేపీకి అనుకూలంగా ఉందని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ కొన్ని సార్లు నిజం అయ్యాయి.. కొన్ని సార్లు అబద్ధం అయ్యాయని తెలిపారు.

ఇది కూడా చదవండి: Andhra Pradesh: ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్‌.. తెలంగాణ ఆస్పత్రుల్లోనూ అనుమతి

సంగారెడ్డి జిల్లాను మరో జవహర్ నగర్‌గా మార్చాలనే కుట్ర జరుగుతుంది. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా హైదారాబాద్ నుంచి వేస్టేజ్ తీసుకొచ్చి అక్కడ శుద్ధి చేస్తారట. నల్లవెల్లి ఫారెస్ట్ మధ్యలో పనులు మొదలు పెట్టారు. ఇప్పటికే రసాయన కంపెనీల వల్ల భూములు పాడై పోయాయి. ఇప్పుడు హైదరాబాద్ చెత్తను అక్కడకి తీసుకొచ్చి వేస్తారట. గత ప్రభుత్వమే భూమి ఇచ్చిందనీ అధికారులు చెబుతున్నారు. పనులు ఆపకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతాను. చెత్తను శుద్ధి చేసేందుకు కొత్త కొత్త టెక్నాలజీ‌లు వచ్చాయి… చిత్త శుద్ది ఉంటే టెక్నాలజీ వాడండి.’’ అని రఘునందన్‌రావు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Toll Charge : టోల్‌ ఛార్జీలకు ఏడాది, లైఫ్‌టైమ్ పాస్‌లు.. కేంద్రం కొత్త ప్రణాళిక

దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అంతేకాకుండా భారీగానే పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచి ఓటర్లు పోటెత్తారు. ఇక పోలింగ్ అనంతరం ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేశాయి. అయితే ఈసారి అధికారం మాత్రం కమలానిదేనని సర్వేలు తేల్చేశాయి. జాతీయ మీడియా సర్వేలన్నీ బీజేపీకే పట్టం కట్టాయి. మొదటి స్థానంలో బీజేపీ, రెండో స్థానంలో ఆప్, మూడో స్థానంలో కాంగ్రెస్ ఉంటుందని తెలిపాయి. కాంగ్రెస్ పూర్తిగా తుడుచుకు పెట్టుకుపోతుందని తెలిపాయి.

 

ఎగ్జిట్ పోల్స్ ఇవే..

పీపుల్స్‌పల్స్‌-కొడిమో
బీజేపీ: 51-60
ఆప్‌: 10-19
కాంగ్రెస్‌: 0
ఇతరులు: 0

టైమ్స్‌ నౌ
బీజేపీ: 39-45
ఆప్‌: 29-31
కాంగ్రెస్‌: 0-2

ఏబీపీ-మ్యాట్రిజ్‌
బీజేపీ: 35-40
ఆప్‌: 32-37
కాంగ్రెస్‌: 0-1

రిపబ్లిపకన్‌ మార్క్‌
బీజేపీ : 39-41
ఆప్‌ : 21-31

చాణక్య
బీజేపీ: 39-44
ఆప్‌: 25-28