దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు. రఘునందన్‌రావు మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ ప్రజల మూడ్ బీజేపీకి అనుకూలంగా ఉందని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ కొన్ని సార్లు నిజం అయ్యాయి.. కొన్ని సార్లు అబద్ధం అయ్యాయని తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అంతేకాకుండా భారీగానే పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచి ఓటర్లు పోటెత్తారు. ఇక పోలింగ్ అనంతరం ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేశాయి.