NTV Telugu Site icon

KTR: మన్మోహన్ సింగ్‌తో కేసీఆర్‌కు ఎంతో సాన్నిహిత్యం ఉండేది

Ktr

Ktr

KTR: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్‌కు మన్మోహన్ సింగ్‌తో ఎంతో సాన్నిహిత్యం ఉండేదని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. మన్మోహన్ లాంటి మహానుభావుడిని కోల్పోవడం దేశానికి తీరని లోటని అన్నారు. కేసీఆర్‌ ఆదేశాల మేరకు పార్టీ తరపున నివాళులు అర్పించడానికి వచ్చామన్నారు. దేశం మంచిని కాంక్షించే వారిని కోల్పోవడం బాధాకరమని కేటీఆర్‌ తెలిపారు. దాదాపు రెండు సంవత్సరాలపాటు మన్మోహన్ క్యాబినెట్ లో కేసీఆర్‌ పని చేశారన్నారు.

Read also: Manmohan Singh: మన్మోహన్ సింగ్ జ్ఞాపకార్థం ఢిల్లీలో స్మారక చిహ్నం నిర్మించనున్న కేంద్ర ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఎప్పుడైనా కలిసినప్పుడు ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. తెలంగాణ కోసం మన్మోహన్ సింగ్ దిశా నిర్దేశం చేశారన్నారు. 2004లో క్యాబినెట్లో చేరిన తర్వాత అనేక ఒడిదుడుకులు ఎదురైనప్పుడు మీరు మానసిక స్థైర్యాన్ని కోల్పోవద్దు అంటూ మన్మోహన్ ఎంతో భరోసా ఇచ్చారని కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ ఏర్పాటులో న్యాయమైన డిమాండ్ ఉందని కాంక్షించిన నాయకుడు మన్మోహన్ అని తెలిపారు.

Read also: Kadapa: కడప జిల్లాలో తీవ్ర విషాదం.. రైతు కుటుంబం సూసైడ్, నలుగురు మృతి

భారతదేశంలో ఆర్థిక సంక్షోభంలో నుంచి బయట వేయడమే కాకుండా.. ప్రపంచంలోనే మన దేశానికి మంచి పేరు తీసుకురావడం మాత్రమే కాకుండా సౌమ్యుడుగా వివాద రహితుడుగా భారతదేశానికి గొప్ప పేరు తీసుకొచ్చారని తెలిపారు. భారత దేశానికి దిశానిర్దేశం చేయడం మాత్రమే కాకుండా ఒక ఆర్థిక వేత్తగా, ఒక పరిపాలన దక్షుడిగా పేరు తెచ్చుకున్న మహానుభావులు డాక్టర్ మన్మోహన్ సింగ్. ప్రపంచంలో భారత్ దేశానికి వన్నె తెచ్చిన నాయకుడు డాక్టర్ మన్మోహన్ అని కేటీఆర్ అన్నారు. ఏనాడు ఏ వివాదం వివాదం జోలికిపోకుండా కేవలం భారతదేశం బాగోగులు, మంచిది కాంక్షించిన వ్యక్తి, అందరితో కలిసిమెలిసి పనిచేసిన వ్యక్తి అన్నారు.
UnstoppableWithNBK : విక్టరీ వెంకటేష్ బెస్ట్ ఫ్రెండ్ ఆమేనట