కామారెడ్డి జిల్లాలో పోలీసుల తీరుపై విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కామారెడ్డి జిల్లాలో భూమ్‌బాయి అనే వ్యక్తి మృతి చెందగా.. పోలీసులు కొట్టడం వల్లే తన భర్త చనిపోయాడని మహిళ ఆరోపిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. రెండు రోజుల క్రితం కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం శాంతాపూర్ గ్రామంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటనలో పేకాట ఆడుతున్న నిందితులను స్టేషన్‌కు తీసుకువెళ్లి పోలీసులు చితకబాదడంతో భూమ్‌బాయికి తీవ్రగాయాలయ్యాయి. ఆయన్ను చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ భూమ్‌బాయి ప్రాణాలు విడిచాడు.

భూమ్‌బాయి చనిపోవడంపై ఆయన భార్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తన భర్తను పోలీసులు కొట్టడం వల్లే చనిపోయాడని ఆమె ఆరోపిస్తోంది. తన భర్త మృతదేహాన్ని తమకు అప్పగించాలని కోరుతూ డీజీపీ మహేందర్‌రెడ్డి లేఖ రాసింది. తన భర్త పేకాట ఆడాడని.. అయితే అంత మాత్రానికే కొట్టి చంపేస్తారా అంటూ ఆమె పోలీసులను ప్రశ్నిస్తోంది. కర్రతో చితకబాదడం వల్లే తీవ్రగాయాలు కావడంతో తన భర్త చనిపోయాడని.. తమకు న్యాయం చేయాలని లేఖ ద్వారా డీజీపీని కోరింది. మరోవైపు శాంతాపూర్ గ్రామంలో పోలీసుల తీరును నిరసిస్తూ గ్రామస్తులు ధర్నా చేపట్టారు. భూమ్‌బాయి కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Also Read
- Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
- Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
- HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
- DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
Read Also: భారత్‌లో కొత్తగా 12,516 కరోనా కేసులు
తాజావార్తలు
-
Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
-
Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
-
సమంతకు ముందే.. గర్భంతో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రసవాన్నే సినిమాలో చూపించారు!
-
QR Code Mandatory on Medicines: ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. ఇకపై అసలైన, నకిలీ మందులను క్షణాల్లో గుర్తించొచ్చు!
-
Raja Shivaji OTT: బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన ‘రాజా శివాజీ’.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!