కామారెడ్డి జిల్లాలో భూమ్‌బాయి అనే వ్యక్తి మృతి చెందగా.. పోలీసులు కొట్టడం వల్లే తన భర్త చనిపోయాడని మహిళ ఆరోపిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. రెండు రోజుల క్రితం కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం శాంతాపూర్ గ్రామంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటనలో పేకాట ఆడుతున్న నిందితులను స్టేషన్‌కు తీసుకువెళ్లి పోలీసులు చితకబాదడంతో భూమ్‌బాయికి తీవ్రగాయాలయ్యాయి. ఆయన్ను చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి…