Chicken Piece: పార్టీలో ప్రాణం తీసిన చిక్కెన్ ముక్క.. గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chicken Piece: మనిషి జీవితం దేవుడి చేతిలో కీలుబొమ్మ లాంటిదని పెద్దలు అంటారు. ఎందుకంటే మనిషిని ఎప్పుడు ఎలా ఆడుకోవాలో దేవుడే చూసుకుంటాడు. ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు ప్రాణం తీయాలి అనేది కూడా ఆ దేవుడి చేతిలోనే ఉందని అంటున్నారు. కానీ ఈ రోజుల్లో, ప్రజలు అలాంటి పదాలను కొట్టిపడేస్తుంటారు. మరణం ఏ రూపంలో వస్తుందో ఊహించలేము. కానీ వెలుగులోకి వస్తున్న కొన్ని సంఘటనలు చూసిన తర్వాత మనుషుల జీవితాలు దేవుడి చేతిలో కీలుబొమ్మలా ఉంటాయని అందరూ నమ్మాల్సిందే. ఎందుకంటే అప్పటిదాకా అంతా సజావుగానే సాగిపోతుందని అనుకుంటుండగా.. అనుకోని సంఘటనలు చివరికి ప్రాణాలు తీస్తాయి. ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. చికెన్ ముక్క ఇరుక్కుని ఓవ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో చోటుచేసుకుంది.
Read also: Ariyana Glory : పింక్ డ్రెస్‌లో పరువాల విందు.. స్టన్నింగ్ స్టిల్స్ తో రచ్చ..
Also Read
జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన జితేంద్ర కుమార్ వర్మ, ధర్మేందర్ తివారీ కొంతకాలంగా ఎలికట్ట గ్రామంలో ఇల్లు అద్దుకు తీసుకుని నివాసం ఉంటున్నాడు. అయితే వారిద్దరూ నిన్న రాత్రి దావత్ చేసుకు చిల్ అవుదామని ఫిక్స్ అయ్యారు. దావత్ అంటే మామూలుగా ఉంటుందా.. నాన్ వెజ్ తప్పని సరి మరి. అందుకు ఇద్దరు ఏర్పాట్లు చేసుకున్నారు. చికెన్ తెచ్చకుని, అందులో పూరి కూడా తినడానికి వండుకున్నారు. అందులోకి మద్యం కూడా తీసుకొచ్చారు. వంటలన్నీ పూర్తయ్యాక.. చాలా హ్యాపీగా పార్టీని ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఊహించని విషాదం తలుతట్టింది. మద్యం సేవించి భోజనం చేస్తుండగా జితేంద్రకుమార్ ఒక్కసారిగా కిందకు పడిపోయాడు. ఏం జరిగిందో ధర్మేందర్ కు అర్థం కాలేదు. ముందు తను ఎక్కువ తాగింటాడు అందుకే జితేందర్ కిందికి పడిపోయి ఉంటాడని అనుకున్నాడు. కాసేపు అతన్ని గమనించిన ధర్మేందర్ ఒక్కసారిగా షాక్ తిన్నాడు. జితేంతర్ శ్వాస తీసుకోవడం లేదని గమనించిన ధర్మేందర్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. గొంతులో చికెన్ ముక్క ఇరుక్కోవడంతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ధర్మేందర్ తివారీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Pawan Kalyan: జనసేనలోకి ముద్రగడ..? ఇంటికి వెళ్లి ఆహ్వానించనున్న పవన్ కల్యాణ్..!
తాజావార్తలు
-
Shreyas Iyer: కేక్‌పై ఐసింగ్ లాంటిది.. టీమిండియా కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్!
-
Sriram Krishnan: ట్రంప్ ప్రభుత్వానికి షాక్.. AI విధాన సలహాదారు పదవికి శ్రీరామ్ కృష్ణన్ రాజీనామా
-
Drishyam 3 Hindi Version : ‘దృశ్యం 3’ హిందీ వెర్షన్ లో భారీ మార్పులు… రీజన్ ఇదేనా ?
-
Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
-
Rajat Patidar: రెండు ఐపీఎల్ టైటిల్స్, 500 రన్స్.. పాటిదార్ ఎంపిక కాకపోవడంపై అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!