జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో ఓ వ్యక్తి మంగళవారం సెల్ టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. వివరాల్లోకి వెళ్తే… దేవరుప్పుల గ్రామానికి చెందిన దుంపల సంపత్ అనే వ్యక్తి తనకు సంబంధించిన వ్యవసాయ భూమిని ఎవరో ఆక్రమించారని ఆరోపిస్తున్నాడు. ఈ విషయంలో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగడం లేదని వాపోతున్నాడు.
Read Also: తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో అరుదైన సర్జరీ విజయవంతం
తన భూమి ఆక్రమణకు గురైందని ఎంతమంది అధికారులకు ఫిర్యాదు చేసినా తన సమస్యను ఎవరూ పట్టించుకోవడంలేదని బాధితుడు సంపత్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీంతో తనకు ఆత్మహత్య శరణ్యమని భావించి మంగళవారం ఉదయం దేవరుప్పుల ప్రధాన రహదారి పక్కన ఉన్న సెల్‌టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక అధికారులు సంపత్‌ను సెల్ టవర్ నుంచి కిందకు దించేందుకు ప్రయత్నిస్తున్నారు.