Site icon NTV Telugu

Congress: వీహెచ్‌కు మల్లు రవి కౌంటర్.. టీఆర్‌ఎస్‌ లాభం చేకూరేలా..!

టి.పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిని టార్గెట్‌ చేస్తూ ఆరోపణలు గుప్పించిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతరావుకు కౌంటర్‌ ఇచ్చారు కాంగ్రెస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మల్లు రవి.. రేవంత్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మల్లు రవి.. వీహెచ్‌ నాకు అన్న లాంటివారు.. కానీ, ఆయన వ్యాఖ్యలు ఖండిస్తున్నానని పేర్కొన్నారు.. రేవంత్‌ రెడ్డి పీసీసీ చీఫ్‌ కంటే ముందు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అని గుర్తుచేసిన ఆయన.. బీహార్ ఐఏఎస్, ఐపీఎస్‌లకు పోస్టులు ఇవ్వొద్దు అని రేవంత్‌ ఎక్కడా చెప్పలేదన్నారు.. సమతుల్యత పాటించకుండా… బీహార్ వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ఏంటని అడిగారి గుర్తుచేశారు.. బీహార్ వాళ్లకు వ్యతిరేకం కాదు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ప్రాతినిధ్యం లేదని మాట్లాడటం తప్పా? అని ప్రశ్నించారు మల్లు రవి.

Read Also: VH: రేవంత్‌పై వీహెచ్‌ ఫైర్‌.. పాత కాంగ్రెస్ వాళ్లు ఏం కావాలి..?

అన్నీ పదవులు బీహార్ వాళ్ళకే ఇస్తే.. తెలంగాణ ఐఏఎస్, ఐపీఎస్‌లు ఎటు పోవాలి..? అని ప్రశ్నించారు మల్లు రవి… తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అధికారుల్ని అణచివేతను గురి అవుతున్నారు అనడం తప్పు అవుతుందా ? అని వీహెచ్‌ను నిలదీసిన ఆయన.. కాంగ్రెస్ కండువా కప్పుకున్న క్షణం నుండి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో టీడీపీ కాంగ్రెస్… కాంగ్రెస్ అని రెండు వేర్వేరుగా ఉండవన్న ఆయన.. తెలంగాణలో ఉన్నది ఒకే కాంగ్రెస్‌ పార్టీ అన్నారు.. ఇక, పీఏసీ ఇంతకు ముందు ఎప్పుడు జరగని విధంగా సమావేశం అవుతుందని.. ఏదైనా చెప్పాలి అంటే పీఏసీలో చెప్పాలని సూచించారు.. కానీ, వీహెచ్‌.. టీఆర్ఎస్‌కు లాభం చేకూరేలా మాట్లాడారని ఆరోపించారు మల్లు రవి.

Exit mobile version